Disinvestment: పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 8 ఏళ్లలో ₹4 లక్షల కోట్లు

Disinvestment: ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వానికి గడిచిన 8 ఏళ్లలో రూ.4 లక్షల కోట్లు సమకూరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.

Published : 20 Dec 2022 19:50 IST

దిల్లీ: మోదీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. తొలిసారి అధికారంలోకి వచ్చిన మొదలు.. నేటి వరకు పలు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, వ్యూహాత్మక విక్రయాలు చేపట్టింది. ఇలా ఈ 8 ఏళ్లలో రూ.4.04 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు సమకూరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ (దీపమ్‌) దీన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తోంది.

2014 నుంచి ఇప్పటి వరకు 59 కేసుల్లో ఆఫర్‌ సేల్‌ కింద అత్యధికంగా రూ.1.07 లక్షల కోట్లు సమకూరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 10 విడతలుగా ఈటీఎఫ్‌ల్లో వాటాల అమ్మకం ద్వారా రూ.98,949 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. ఎయిరిండియా సహా 10 సంస్థలను వ్యూహాత్మక విక్రయం ద్వారా రూ.69,412 కోట్ల సమకూరినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 17 ప్రభుత్వరంగ సంస్థల లిస్టింగ్‌ ద్వారా రూ.50,386 కోట్లు వచ్చినట్లు తెలిపింది. ఒక్క ఎల్‌ఐసీ ద్వారానే రూ.20,516 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే, ప్రదీప్‌ పాస్ఫేట్ లిమిటెడ్‌ (రూ.472 కోట్లు), ఐపీసీఎల్‌ (రూ.219 కోట్లు), టాటా కమ్యూనికేషన్‌ (రూ.8,847 కోట్లు)లో ప్రభుత్వానికి ఉన్న మిగిలిపోయిన షేర్ల విక్రయించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని