గ్రూప్‌ఎం దక్షిణాసియా సీఓఓగా అశ్విన్ పద్మనాభన్‌

డబ్ల్యూపీపీకి చెందిన మీడియా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ గ్రూప్ఎమ్ దక్షిణాసియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా (COO) అశ్విన్‌ పద్మనాభన్‌ నియమితులయ్యారు.

Updated : 02 Jul 2024 18:35 IST

హైదరాబాద్‌: డబ్ల్యూపీపీకి చెందిన మీడియా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ గ్రూప్ఎమ్ దక్షిణాసియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా (COO) అశ్విన్‌ పద్మనాభన్‌ నియమితులయ్యారు. ఇన్‌ఫ్లూయెన్సర్‌ మార్కెటింగ్‌ కంటెంట్‌తో పాటు పెట్టుబడులు, వ్యాపారం, భాగస్వామ్యాలు వంటి విభాగాల బాధ్యతలను ఆయన చూస్తారు. అశ్విన్ దూరదృష్టి సంస్థ వృద్ధికి దోహదం చేస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. క్లయింట్ అవసరాలు, పరిశ్రమ ఎకో సిస్టమ్‌ను అర్థం చేసుకోవడంలో ఆయనకు తనదైన ట్రాక్‌ రికార్డు ఉందని గ్రూప్‌ ఎం దక్షిణాసియా సీఈఓ ప్రశాంత్‌ కుమార్‌ అన్నారు. తనను చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా నియమించడం పట్ల అశ్విన్‌ సంతోషం వ్యక్తంచేశారు. మెరుగైన సేవలు అందించేందుకు తన బృందంతో కలిసి అంకిత భావంతో పనిచేస్తానని చెప్పారు. గురుగ్రామ్‌ నుంచి అశ్విన్‌ గ్రూప్‌ఎంకు సేవలందిస్తారు. ప్రశాంత్‌ కుమార్‌కు రిపోర్ట్‌ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని