GST collections: మార్చిలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు!
మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.42 లక్షల వద్ద జీవనకాల గరిష్ఠానికి చేరాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 15 శాతం వృద్ధి నమోదైంది....
దిల్లీ: మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెంది రూ.1.42 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో వసూలైన రూ.1.33 లక్షల కోట్లతో పోలిస్తే 6.8 శాతం పెరిగాయి.
మార్చి నెలకుగానూ రూ.1,42,095 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం వెల్లడించింది. ఇందులో కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) రూ.25,830 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూ.32,378 కోట్లు. సమ్మిళిత జీఎస్టీ (ఐజీఎస్టీ) కింద రూ.74,470 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.39,131 కోట్లతో కలిపి), సెస్ రూపంలో రూ.9,389 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.981 కోట్లతో కలిపి) వసూలైనట్లు ఆర్థికశాఖ తెలిపింది.
గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ సారి జీఎస్టీ వసూళ్లు 15శాతం, 2020లో ఇదే నెలతో పోలిస్తే 46 శాతం పెరిగాయి. ఇప్పటి వరకు 2022 జనవరి నెలలో జీఎస్టీ వసూళ్లు గరిష్ఠంగా ఉన్నాయి. ఆ నెల ₹1,40,986 కోట్లు వసూలయ్యాయి. వరుసగా తొమ్మిదో నెలా వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటడం విశేషం. మొత్తం 2021-22 ఆర్థిక ఏడాదిలో జీఎస్టీ వసూళ్లు రూ.14.83 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. క్రితం ఆర్థిక సంవత్సరం వసూలైన రూ.11.37 లక్షల కోట్లతో పోలిస్తే 30 శాతం అధికం.
ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణతో పాటు పన్ను ఎగవేత నిరోధక చర్యలు ఫలిస్తుండడం వల్లే వసూళ్లు పెరిగాయని ఆర్థిక శాఖ తెలిపింది. రేట్ల హేతుబద్ధీకరణ కూడా అందుకు దోహదం చేస్తోందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM