GST: జీఎస్టీలో దూకుడు.. ఫిబ్రవరిలోనూ రూ.1.49లక్షల కోట్ల వసూళ్లు

ఫిబ్రవరి నెలలో రూ.1.49లక్షల కోట్ల జీఎస్టీ (GST) వసూలు అయినట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. క్రితం ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే 12శాతం వృద్ధి కనిపించిందని తెలిపింది.

Published : 01 Mar 2023 16:38 IST

దిల్లీ: వస్తు సేవల పన్ను (GST) వసూళ్లలో పెరుగుదల కనిపిస్తోంది. ఫిబ్రవరి నెలలో రూ.1.49లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. గత ఫిబ్రవరిలో రూ.1.33 లక్షల కోట్లు వసూలు కాగా.. తాజాగా 12శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత కేవలం సుంకం ద్వారానే ఈ నెలలో గరిష్ఠ ఆదాయం వచ్చిందని.. సుంకాల రూపంలో ఫిబ్రవరిలో రూ.11,931కోట్లు వసూలైనట్లు పేర్కొంది.

ఫిబ్రవరి నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.1,49,577 కోట్లు కాగా అందులో సీజీఎస్టీ (CGST) కింద రూ.27,662 కోట్లు, ఎస్‌జీఎస్టీ (SGST) కింద రూ.34,915 కోట్లు, ఐజీఎస్టీ (IGST) కింద రూ.75,069 కోట్లు సమకూరినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. సెస్సుల రూపంలో రూ.11,931 కోట్లు (వస్తువుల దిగుమతి నుంచి వసూలు చేసిన సుంకాలు కలిపి) వసూలైనట్లు పేర్కొంది.

జనవరి-2023లో రికార్డు స్థాయిలో రూ.1.57లక్షల కోట్లు జీఎస్టీ వసూలైంది. ఇప్పటివరకు వసూలైన జీఎస్టీలో ఇది రెండో అత్యధికం. ఏప్రిల్‌ 2022లో మాత్రం అత్యధికంగా రూ.1.68లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కావడం ఆల్‌టైం రికార్డుగా ఉంది. ఇక ఫిబ్రవరిలో 28రోజులు ఉండటం వల్ల మునుపటి నెలలతో పోలిస్తే వసూళ్లు తక్కువ నమోదవుతాయని ఆర్థికశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని