GST collections: మరోసారి భారీగా జీఎస్టీ వసూళ్లు.. ఏప్రిల్‌ తర్వాత ఇదే..

GST collections in july: గతేడాదితో పోల్చినప్పుడు 28 శాతం అధికంగా జీఎస్టీ వసూలు అవ్వడం గమనార్హం. 

Updated : 01 Aug 2022 18:33 IST

 

దిల్లీ: వస్తు, సేవల పన్ను (GST collections) వసూళ్లు మరోసారి భారీగా పెరిగాయి. జులైకు గానూ రూ.1.49 లక్షల కోట్లు వసూలయ్యాయి. గతేడాదితో పోల్చినప్పుడు 28 శాతం వృద్ధి నమోదైంది. ఆర్థిక రికవరీ, పన్ను ఎగవేతలు అరికట్టడం వంటి కారణాల వసూళ్లు పెరిగినట్లు కేంద్రం తెలిపింది. 2021లో జులైలో జీఎస్టీ వసూళ్లు రూ. 1.16 లక్షల కోట్లు మాత్రమే.

2017లో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రెండో అత్యధిక వసూళ్లు సాధించిన నెలగా ఈ ఏడాది జులై నిలిచింది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో సాధించిన రూ. 1.68 లక్షల కోట్లే జీఎస్టీ వసూళ్లలో అత్యధికం. తాజా వసూళ్లలో సీజీఎస్టీ ద్వారా రూ.25,751 కోట్లు, ఎస్‌జీఎస్టీ ద్వారా రూ.32.807 కోట్లు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఐజీఎస్టీ కింద రూ.79,518 కోట్లు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. సెస్సుల రూపంలో మరో రూ.10,920 కోట్లు సమకూరినట్లు కేంద్రం వెల్లడించింది. 

ఏపీ, తెలంగాణలో ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో సైతం జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. గతేడాది జులై తెలంగాణ రూ.3610 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు సాధించగా.. ఈ సారి 26 శాతం వృద్ధితో రూ.4,547కోట్లు సాధించినట్లు కేంద్రం తెలిపింది. ఏపీలో సైతం జీఎస్టీ వసూళ్లలో 25 శాతం వృద్ధి కనిపించింది. గతేడాది రూ.2,730 కోట్లు జీఎస్టీ రూపంలో వసూలవ్వగా.. ఈ సారి రూ.3,409 కోట్లు వసూలు అయినట్లు కేంద్రం తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని