Nirmala sitharaman: చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలు: నిర్మలా సీతారామన్

చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Updated : 22 Jun 2024 20:10 IST

దిల్లీ: చిరు వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. కౌన్సిల్‌ సమావేశం ముగిసిన తర్వాత దిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘జీఎస్టీ గత సమావేశం అక్టోబర్‌లో జరిగింది. అజెండా విషయాలపై మరోసారి సమావేశం అవుతాం. ఎన్నికల కోడ్‌ కారణంగా చాలా రోజులుగా జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ జరగలేదు. జీఎస్టీ మండలిలో అనేక విషయాలు చర్చించాం. ఆగస్టు చివరి వారం మళ్లీ సమావేశం అవుతాం. పన్నులు కట్టేవారి కోసం అనేక అనుకూల నిర్ణయాలు తీసుకున్నాం. జీఎస్టీ సెక్షన్‌ 73 కింద డిమాండ్‌ నోటీసులు ఇచ్చాం.

వచ్చే ఏడాది మార్చిలోగా పన్ను కట్టేవారికి మినహాయింపులు ఇస్తాం. జీఎస్టీపై ట్రైబ్యునళ్లు, కోర్టులకు వెళ్లే ట్రాన్సాక్షన్ పరిమితి పెంచాం. చిన్న వ్యాపారులకు మేలు కలిగేలా జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయాలున్నాయి. జరిమానాలపై విధిస్తున్న వడ్డీని ఎత్తివేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. సీజీఎస్టీ చట్టంలో సవరణలకు జీఎస్టీ కౌన్సిల్‌ ప్రతిపాదించింది. జీఎస్టీ కట్టేందుకు చివరితేదీ గడువు పొడిగించాం. ఈ నిర్ణయాలతో వర్తకులు, ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి చేకూరుతుంది. ఇన్‌పుట్ క్రెడిట్‌ ట్యాక్స్‌ విషయంలో మార్పులు చేయాలని నిర్ణయించాం. అక్రమాలు జరగకుండా ఆధార్‌ అథెంటిఫికేషన్‌ తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆర్థిక మంత్రి తెలిపారు.

మరిన్ని నిర్ణయాలు

  • విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాల్లో కాకుండా బయట ఉంటున్న వాళ్లకు నెలకు రూ.20000 వరకు జీఎస్టీ నుంచి మినహాయింపు.
  • అన్ని రకాల సోలార్‌ కుక్కర్‌లపై 12 శాతం జీఎస్టీ.
  • రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫారం టికెట్లు, వెయిటింగ్‌ రూమ్‌, క్లాక్‌ రూమ్‌, బ్యాటరీ కారు సేవలపై జీఎస్టీ తొలగింపు.
  • స్టీల్‌, ఇనుము, అల్యూమినియంతో తయారు చేసే పాల క్యాన్లపై 12 శాతం జీఎస్టీ.
  • అన్ని కార్టన్‌ బాక్సులపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు. తద్వారా యాపిల్‌, ఇతర పండ్ల వ్యాపారులకు మేలు.
  •  స్ప్రింకర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు