GST Council meeting: 22న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

GST Council meeting: జీఎస్టీ మండలి జూన్‌ 22న దిల్లీలో భేటీ కానుంది. నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరగనుంది.

Published : 13 Jun 2024 14:34 IST

GST Council meeting | దిల్లీ: వివిధ రకాల వస్తువులపై జీఎస్టీ (GST rates) రేట్లు నిర్ణయించే అధికారం కలిగిన జీఎస్టీ కౌన్సిల్‌ (GST council) సమావేశం జూన్‌ 22న జరగబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ అధ్యక్షతన  దిల్లీ వేదికగా 53వ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొననున్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి సమావేశం ఇదే. అక్టోబర్‌ 7న చివరి సమావేశం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తికాల బడ్జెట్‌ సమర్పణకు ముందు ఈ భేటీ జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించకుంది. ఈ భేటీలో ఏయే అంశాలపై చర్చిస్తారనేది ఇంకా తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని