Published : 19 May 2022 18:00 IST

GST: జీఎస్‌టీ మండలి సిఫార్సులపై సుప్రీం కీలక తీర్పు..

దిల్లీ: జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) మండలి సిఫార్సులపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మండలి చేసే ప్రతిపాదనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే సహకార సమాఖ్య వ్యవస్థలో ఉన్నందున వాటికి విలువ ఇవ్వాలని సూచించింది. జీఎస్‌టీ చట్టాల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన హక్కులు ఉన్నాయని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.

సముద్రంలో సరకు రవాణాపై 5శాతం ఐజీఎస్‌టీ విధిస్తూ 2017లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను గుజరాత్‌ హైకోర్టు రద్దు చేసింది. ఓడలో సరకు రవాణాకు ఎలాంటి ఐజీఎస్‌టీ విధించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం.. జీఎస్‌టీ మండలి సిఫార్సులపై కీలక వ్యాఖ్యలు చేసింది.

‘‘జీఎస్‌టీ కౌన్సిల్‌ చేసిన ప్రతిపాదనలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. ఆర్టికల్‌ 246ఏ ప్రకారం.. పన్నులపై చట్టాలు చేసుకునే విషయంలో పార్లమెంట్‌, రాష్ట్రాల శాసనసభలకు సమాన హక్కులున్నాయి. జీఎస్‌టీపై కేంద్ర, రాష్ట్రాలు వేర్వేరు చట్టాలు చేసుకోవచ్చు. అయితే మనం సహకార సమాఖ్య వ్యవస్థలో ఉన్నందున ఆర్టికల్‌ 279 ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా వ్యవహరించకూడదు. జీఎస్‌టీ చట్టాల అమలు విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య విభేదాలు వస్తే.. జీఎస్‌టీ మండలి సరైన సలహాలు ఇవ్వాలి. ఆచరణీయ పరిష్కారం కోసం సామరస్యంగా పనిచేయాలి. ఒకరి అభిప్రాయాలను మరొకరిపై బలవంతంగా రుద్దకుండా చర్చించుకోవాలి. ఈ చర్చల ఆధారంగానే జీఎస్‌టీ ప్రతిపాదనలు చేయాలి’’ అని ధర్మాసనం పేర్కొంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని