GST council meeting: 18న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం.. అజెండా ఇదేనా?

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) అధ్యక్షతన ఈ నెల 18న GST council meeting జరగనుంది. పాన్‌ మసాలా, గుట్కా సంస్థలు; ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో, రేస్‌ కోర్సులపై పన్ను విధించే అంశంపై చర్చ జరగనుంది. 

Published : 03 Feb 2023 20:44 IST

దిల్లీ: జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి (GST council meeting) తేదీ ఖరారైంది. ఈ నెల 18న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) అధ్యక్షతన దిల్లీలో భేటీ జరగనున్నట్టు జీఎస్టీ కౌన్సిల్‌ ట్విటర్‌లో వెల్లడించింది. పాన్ మసాలా, గుట్కా సంస్థలపై పన్ను విధించే అంశంతో పాటు అప్పిలేట్‌ ట్రైబ్యునళ్ల ఏర్పాటుపై మంత్రుల బృందం (GoM) ఇచ్చిన నివేదికలపై ఈ 49వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే, ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినో, రేస్‌ కోర్స్‌లపై జీఎస్టీ విధించేందుకు మేఘాలయ సీఎం కన్రాడ్‌ సంగ్మా నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల బృందం సమర్పించిన సిఫార్సులపైనా ఈసారి చర్చించనున్నట్టు సమాచారం. గతేడాది డిసెంబర్‌ 17న జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మూడు మంత్రి బృందాలు(GoM) సమర్పించిన నివేదికలు అజెండా అంశాల్లో భాగంగా ఉన్నప్పటికీ.. అవి చర్చకు రాలేదు. దీంతో ఈ సమావేశంలో ఆయా అంశాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని