రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విడుదల

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. 17వ వాయిదాలో రూ.5వేల కోట్లు విడుదల

Published : 20 Feb 2021 12:55 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. 17వ వాయిదాలో రూ.5వేల కోట్లు విడుదల చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో తెలంగాణకు రూ.1940.95 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,222.71 కోట్లు ఉన్నాయి. రాష్ట్రాలకు ఇప్పటి వరకు రూ.లక్ష కోట్ల పరిహారం ఇచ్చినట్టు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రాలకు 91శాతం లోటును భర్తీ చేశామని కేంద్రం పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రాలకు రూ.91,460.34 కోట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.8,539.66 కోట్లు విడుదల చేసింది.

ఇవీ చదవండి...

తీవ్రంగా నష్టపోయాం..హోదా ఇవ్వండి: జగన్‌

కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతోనే ఆర్థికవృద్ధి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని