GST collections: జీఎస్‌టీ వసూళ్లు ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. గతేడాది కంటే 20% వృద్ధి!

GST collections april: వస్తు, సేవల పన్ను (GST Collections) వసూళ్లు కొత్త రికార్డు సృష్టించాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఏప్రిల్‌ నెలకు గానూ రూ.1.68 లక్షల కోట్లు జీఎస్‌టీ కింద వసూలయ్యాయి.

Updated : 01 May 2022 15:12 IST

దిల్లీ: వస్తు, సేవల పన్ను (GST Collections) వసూళ్లు కొత్త రికార్డు సృష్టించాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఏప్రిల్‌ నెలకు గానూ రూ.1.68 లక్షల కోట్లు జీఎస్‌టీ కింద వసూలయ్యాయి. గతేడాది ఏప్రిల్‌తో నెలతో పోలిస్తే వసూళ్లు ఏకంగా 20 శాతం వృద్ధి నమోదుచేయడం విశేషం. గత నెలతో పోల్చినప్పుడు (మార్చి- రూ.1.42 లక్షల కోట్లు) ఏకంగా రూ.25వేల కోట్లు వసూళ్లు పెరగడం గమనార్హం. జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లు దాటడం కూడా ఇదే మొదటిసారి.

వసూలైన మొత్తం జీఎస్‌టీలో సీజీఎస్‌టీ కింద రూ.33,159 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ కింద రూ.41,793 కోట్లు, ఐజీఎస్‌టీ కింద రూ.81,939 కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవి కాకుండా సెస్‌ కింద మరో రూ.10,649 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. సకాలంలో పన్ను చెల్లింపులు చేయడానికి విధానాన్ని సులభతరం చేయడంతో పాటు పన్నులు సక్రమంగా చెల్లించనివారిపై తీసుకుంటున్న చర్యల ఫలితంగానే వసూళ్లు పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.


Tap on Image For Zoom White Up Pointing Backhand Index

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని