New year resolutions: పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా న్యూఇయర్‌ రిజల్యూషన్స్‌ ఇవే..!

హర్ష గోయెంకా ట్విటర్‌ వేదికగా తన న్యూఇయర్‌ రిజల్యూషన్స్‌ను పంచుకున్నారు. అవి అందరూ పాటించదగినవిగా ఉండడం విశేషం. అవేంటో మీరూ చూసేయండి!

Published : 01 Jan 2023 19:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త సంవత్సరం అనగానే చాలా మంది తాము సాధించాలనుకునే కొన్ని లక్ష్యాలను ‘న్యూఇయర్‌ రిజల్యూషన్స్‌ (New Year Resolutions)’ పేరిట సిద్ధం చేసి పెట్టుకుంటారు. కొందరు వీటిని కచ్చితంగా అమల్లో పెట్టి ఫలితాన్ని అందుకుంటారు. మరికొందరు ఆరంభ శూరత్వం ప్రదర్శించి కొన్నాళ్లకే సాధారణ జీవితానికి అలవాటుపడిపోతారు. ఈ కొత్త ఏడాది తీర్మానాలు మనకే కాదు... సెలబ్రిటీలకు కూడా ఉంటాయి. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్‌పీజీ గ్రూప్‌ ఛైర్మన్‌ హర్ష గోయెంకా (Harsh Goenka) తన రిజల్యూషన్స్‌ను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. అవేంటో చూద్దాం..

నిత్యం సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే గోయెంకా.. మొత్తం ఏడు తీర్మానాలను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు..

1. ఓటమిని ఆరంభంగా పరిగణించాలి.

2. నేర్చుకోవడం ఆపొద్దు.

3. తెలిసింది ఇతరులకు బోధించాలి.

4. వినయంగా ఉండాలి.

5. నిర్మాణాత్మక విమర్శల్ని గౌరవించాలి.

6. చొరవ తీసుకోవాలి.

7. చేసే పనిని ప్రేమించాలి.

నిజానికి గోయెంకా చెప్పిన ఈ తీర్మానాలు ప్రతి ఒక్కరూ పాటించదగినవే. వీటితో పాటు మన సొంత తీర్మానాలను కూడా అమల్లో పెట్టి ఫలితాలను అందుకుందాం! కొత్త ఏడాదిని సార్ధకం చేసుకుందాం! గోయెంకా చేసిన ఈ పోస్ట్‌కు మూడు గంటల వ్యవధిలోనే దాదాపు 20వేల వీక్షణలు రావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని