Harsha Engineers IPO: ప్రారంభమైన హర్ష ఇంజినీర్స్‌ ఐపీఓ

హర్ష ఇంజినీర్స్‌ ఐపీఓ నేడు ప్రారంభమైంది. ధరల శ్రేణిని రూ.314 - రూ.330గా నిర్ణయించారు....

Updated : 14 Sep 2022 11:17 IST

దిల్లీ: ప్రముఖ బేరింగ్‌ కేజెస్‌ తయారీ కంపెనీ హర్ష ఇంజినీర్స్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ నేడు ప్రారంభమైంది. మూడు రోజుల పాటు షేర్ల సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ కొనసాగి ఈ నెల 16న ముగుస్తుంది. మొత్తం రూ.755 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకొంది. తాజా షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద షేర్లు అందుబాటులో ఉండనున్నాయి.

కంపెనీ ఇప్పటికే యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.225.7 కోట్లు సమీకరించింది. ఒక్కో షేరును రూ.330 వద్ద మొత్తం 68.40 లక్షల షేర్లను వీరికి కేటాయించినట్లు కంపెనీ తెలిపింది. గ్లోబల్‌ స్మాల్‌ క్యాపిటలైజేషన్‌ ఫండ్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇండియా ఈక్విటీ పోర్ట్‌ఫోలియో, పైన్‌బ్రిడ్జ్‌ ఇండియా ఈక్విటీ ఫండ్‌, అబుదాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ-మాన్‌సూన్‌ వంటి ప్రముఖ యాంకర్‌ ఇన్వెస్టర్లు ఈ షేర్లను సొంతం చేసుకున్నాయి.

ఐపీఓ కీలక వివరాలు..

  • ఐపీఓ ప్రారంభ తేదీ: సెప్టెంబరు 14
  • ఐపీఓ ముగింపు తేదీ: సెప్టెంబరు 16
  • ధరల శ్రేణి: రూ.314 - రూ.330
  • సమీకరణ లక్ష్యం: గరిష్ఠ ధర వద్ద రూ.755 కోట్లు
  • తాజా షేర్ల విలువ: రూ.455 కోట్లు
  • ఆఫర్‌ ఫర్‌ సేల్‌ షేర్ల విలువ: రూ.300 కోట్లు
  • ముఖ విలువ: రూ.10
  • రిటైల్‌ మదుపర్ల వాటా: 35 శాతం
  • అర్హతగల మదుపర్ల వాటా: 50 శాతం
  • సంస్థాగతేతర మదుపర్ల వాటా: 15 శాతం
  • కనీసం ఆర్డరు చేయాల్సిన షేర్లు: 45 (ఒక లాట్‌)
  • గరిష్ఠంగా ఆర్డరు చేయాల్సిన షేర్లు: 585 (13 లాట్లు)
  • రీఫండ్ల ప్రారంభ తేదీ: సెప్టెంబరు 22
  • డీమ్యాట్‌ ఖాతాలకు షేర్ల బదిలీ: సెప్టెంబరు 23
  • లిస్టింగ్‌ తేదీ: సెప్టెంబరు 26

కంపెనీ వివరాలు..

హర్ష ఇంజినీర్స్‌ దేశంలో ఆదాయపరంగా అతిపెద్ద ప్రెసిషన్‌ బేరింగ్‌ కేజెస్‌ తయారీ సంస్థ. సోలార్‌ ఈపీసీ వ్యాపారాన్నీ ఇది నిర్వహిస్తోంది. 20 ఎంఎం నుంచి 2,000 ఎంఎం వ్యాసం గల బేరింగ్ కేజెస్‌ను ఇది తయారుచేస్తోంది. వాహన, రైల్వే, ఏవియేషన్‌, ఏరోస్పేస్‌, నిర్మాణం, గనులు, వ్యవసాయం, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, పునరుత్పాదక ఇంధన రంగాలకు ఇది సేవలందిస్తోంది. ఈ కంపెనీకి మొత్తం ఐదు తయారీ కేంద్రాలు ఉండగా.. వీటిలో రెండు భారత్‌ వెలుపల ఉన్నాయి.

ఆర్థిక వివరాలు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని