HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు వాడుతున్నారా? ఇకపై ఆ చెల్లింపులపై ఫీజు!

HDFC Bank: ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ తన క్రెడిట్‌ కార్డుకు సంబంధించి స్వల్ప మార్పు చేసింది. ఇకపై కార్డ్‌ ద్వారా చేసే అద్దె చెల్లింపులపై రుసుము వసూలు చేయనున్నట్లు పేర్కొంది.

Published : 27 Jun 2024 18:56 IST

HDFC Bank | ఇంటర్నెట్‌డెస్క్‌: క్రెడిట్‌ కార్డు ప్రయోజనాలు, క్యాష్‌బ్యాక్‌లు, చెల్లింపుల్లో మార్పులు తీసుకురానున్నట్లు ఇప్పటికే అనేక బ్యాంకులు, కార్డు జారీ సంస్థలు ప్రకటించాయి. తాజాగా ప్రైవేటు రంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) కూడా అదే జాబితాలో చేరింది. ఇకపై కార్డ్‌ ద్వారా జరిపే అద్దె చెల్లింపులపై రుసుము విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇ- మెయిల్‌ ద్వారా యూజర్లకు తెలియజేస్తోంది.

బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో క్రెడ్‌, పేటీఎం, చెక్‌, మొబిక్విక్‌, ఫ్రీఛార్జీతో పాటు ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చేసే అద్దె చెల్లింపులపై ఇకపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1 శాతం రుసుము వసూలు చేయనుంది. గరిష్ఠంగా రూ.3 వేలు వరకు ఈ ఫీజు వసూలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి తీసుకొచ్చింది. మీరు ఈ క్రెడిట్‌ కార్డ్‌ వినియోగిస్తుంటే ఇకపై చెల్లింపులు చేసే సమయంలో ఈ విషయం గుర్తుంచుకోండి.

ఆర్డర్‌ పెట్టిన ఆరేళ్లకు.. ఫ్లిప్‌కార్ట్ నుంచి యూజర్‌కు కాల్‌!

అమెజాన్‌ పే ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ వంటి నిర్దిష్ట కార్డ్‌లు మినహా ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank)కు చెందిన అన్ని క్రెడిట్‌ కార్డులపై అద్దె చెల్లింపులు, ఇ- వాలెట్‌ లోడింగ్‌ లావాదేవీలపై రివార్డ్‌ పాయింట్లను తొలగించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచే ఈ నిబంధనల్ని తీసుకొచ్చింది. ఎస్‌బీఐ అందిస్తున్న AURUM, ఎస్‌బీఐ కార్డ్ ఎలైట్, సింప్లీ క్లిక్‌ ఎస్‌బీఐ కార్డులు వినియోగిస్తున్న వారిపై అద్దె చెల్లింపులపై రివార్డ్‌ పాయింట్లను నిలిపివేసింది. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా టాటా న్యూ ఇన్ఫినిటీ, టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్‌ల్లో త్వరలో మార్పులు చేయనుంది. యూపీఐ లావాదేవీలపై న్యూకాయిన్స్‌ని అందించనుంది. కొత్త మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని