HDFC బ్యాంక్ నుంచి 2 స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్.. వడ్డీ రేట్లు ఇవే..!
HDFC FD rates: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను ప్రకటించింది. ఇందులో సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 7.75 శాతం వరకు వడ్డీని అందిస్తామని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రైవేటురంగ అతిపెద్ద బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) కొత్తగా రెండు స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను (Special Fixed deposit) తీసుకొచ్చింది. అధిక వడ్డీ రేట్లతో పరిమితకాలానికి గానూ ఈ డిపాజిట్ పథకాలను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. 35 నెలల స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌పై సాధారణ పౌరులకు 7.2 శాతం, 55 నెలల కాలవ్యవధితో వస్తున్న ఎఫ్‌డీ స్కీమ్‌పై 7.25 శాతం చొప్పున వడ్డీ చెల్లించనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అలాగే ఇతర ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సైతం సవరించింది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ అందజేస్తామని పేర్కొంది. కొత్త ఎఫ్‌డీ రేట్లు మే 29 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీసుకొచ్చిన స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో ఒకటి 35 నెలలు (2 సంవత్సరాల 11 నెలలు) కాలవ్యవధితో వస్తోంది. ఈ పథకం కింద సాధారణ పౌరులకు 7.20 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు అంటే 7.70 శాతం వడ్డీని ఇస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తీసుకొచ్చిన మరో ఎఫ్‌డీ పథకం 55 నెలల (4 సంవత్సరాల 7 నెలలు) కాలవ్యవధితో వస్తోంది. ఈ పథకం కింద సాధారణ పౌరులకు 7.25 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.75 వడ్డీ గిట్టుబాటు అవుతుంది.
ఈ రెండు స్పెషల్ ఎఫ్‌డీ పథకాలు కాకుండా 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు రూ.2 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 నుంచి 7 శాతం వరకు వడ్డీని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. మరోవైపు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు గరిష్ఠంగా 7-7.20 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మాత్రం 8- 9 శాతం వరకు వడ్డీని ఇస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
YouTuber: మెట్రోలో టికెట్ లేకుండా ప్రయాణం.. యూట్యూబర్‌పై నెటిజన్ల ఫైర్!
-
TSPSC: పోటీపరీక్షల నిర్వహణపై అనుమానాలున్నాయ్!.. విపక్షాల మండిపాటు
-
అలాంటి పోలీసు చిత్రాలు డేంజర్: బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
-
Chandrababu arrest: ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీకి అనుమతి లేదు: విజయవాడ సీపీ
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Niranjan Reddy: పాలమూరు-రంగారెడ్డిపై విపక్షాలది దుష్ప్రచారం: నిరంజన్‌రెడ్డి