HDFC Bank Q3 Results: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభం ₹12,260 కోట్లు

HDFC Bank Q3 Results: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మూడో త్రైమాసికంలో నికర లాభం 18.5 శాతం వృద్ధి చెందింది.

Published : 14 Jan 2023 19:18 IST

దిల్లీ: దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (Q3 Results) ఈ బ్యాంక్‌ స్టాండలోన్‌ పద్ధతిలో రూ.12,259.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతడేది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.10,342.2 కోట్లుగా నమోదైంది. గతేడాదితో పోల్చినప్పుడు లాభం 18.5 శాతం పెరిగిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

స్టాండలోన్‌ పద్ధతిలో కంపెనీ నికర ఆదాయం సైతం మూడో త్రైమాసికంలో రూ.40,651.60 కోట్ల నుంచి రూ.51,207.61 కోట్లకు పెరిగింది. డిసెంబర్‌ 30 నాటికి స్థూల నిరర్థక ఆస్తులు (NPA) 1.23 శాతంగా ఉన్నాయని బ్యాంక్‌ తెలిపింది. నికర నిరర్థక ఆస్తులు గత త్రైమాసికంతో పోలిస్తే 0.37 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గినట్లు బ్యాంక్‌ పేర్కొంది. వడ్డీ ద్వారా వచ్చిన ఆదాయం 24.6 శాతం వృద్ధి చెందింది. మూడో త్రైమాసికంలో మొత్తం రూ.22,987.8 కోట్ల వడ్డీ ఆదాయం సమకూరినట్లు బ్యాంక్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు