Interest Rates: MCLRను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రుణ వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఈఎంఐలు భారం కానున్నాయి.

Published : 07 Mar 2023 17:27 IST

దిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్జినల్‌ కాస్ట్‌-బేస్డ్‌ లెండింగ్‌ రేట్లు (MCLR)ను అన్ని కాలవ్యవధులకు 5 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. దీంతో ఒక నెల MCLR 8.65 శాతం, 3 నెలల MCLR 8.70 శాతం, 6 నెలల MCLR 8.80 శాతం, ఒక సంవత్సరం MCLR 8.95 శాతానికి పెరిగింది. దీనివల్ల గృహ రుణం, ఇతర రుణ వడ్డీ రేట్లు పెరుగుతాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెబ్‌సైట్‌ ప్రకారం సవరించిన వడ్డీ రేట్లు 2023, మార్చి 7 నుంచి అమల్లోకి వచ్చాయి.

గృహరుణ వడ్డీ రేటు పెరిగితే ఈఎంఐ పెరుగుతుంది. అయితే, ఈ బ్యాంకు షెడ్యూల్‌ కంటే మందే రుణాన్ని చెల్లించడానికి యాక్సిలరేటేడ్‌ రీపేమెంట్‌ స్కీమ్‌ అనే ఉచిత ఛార్జీ సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ సౌకర్యం ద్వారా మీ ఆదాయంలో పెరుగుదలను బట్టి, ప్రతి సంవత్సరం ఈఎంఐను పెంచుకోవచ్చు. దీని ఫలితంగా వేగంగా రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని