MCLRను సవరించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు MCLRను 15 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది.

Published : 08 May 2023 15:48 IST

దిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు MCLRను 15 బేసిస్‌ పాయింట్ల (BPS) వరకు పెంచింది. బ్యాంకు వెబ్‌సైట్‌ ప్రకారం ఓవర్‌నైట్‌ MCLR ఇప్పుడు 7.80% నుంచి 7.95%కు చేరుకుంది. ఒక సంవత్సరం MCLR 8.95% నుంచి 9.05%కు పెరిగింది. పెరిగిన మార్జినల్‌ కాస్ట్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు (MCLR) రేట్లు 2023 మే 8 నుంచి వర్తిస్తాయి. గత నెలలో బ్యాంకు నిర్దిష్ట పదవీ కాలవ్యవధులకు 85 బేసిస్‌ పాయిట్ల వరకు MCLR తగ్గించింది. MCLRతో ముడిపడి ఉన్న వ్యక్తిగత, వాహన రుణాల (ఫ్లోటింగ్‌ రేటు రుణాల)కు సంబందించిన పాత రుణగ్రహీతలు మాత్రమే ఈ రేట్ల ద్వారా ప్రభావితమవుతారు.

నిర్దిష్ట రుణం కోసం ఆర్థిక సంస్థ విధించే కనీస వడ్డీ రేటును మార్జినల్‌ కాస్ట్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేట్‌ అంటారు. సాధారణంగా ఇది రుణానికి సంబందించిన అతి తక్కువ వడ్డీ రేటును సూచిస్తుంది. MCLRను నిర్ణయించేటప్పుడు డిపాజిట్‌ రేట్లు, రెపో రేట్లు, ఖర్చులు, నగదు నిల్వల నిష్పత్తిని నిర్వహించడానికి అయ్యే ఖర్చుతో సహా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని