HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్‌.. 13న ఈ సర్వీసులు పనిచేయవ్‌!

HDFC Bank downtime: జులై 13న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లకు కొన్ని సర్వీసులు అందుబాటులో ఉండవు. ఆ వివరాలు తెలుసుకోండి.

Published : 09 Jul 2024 16:27 IST

HDFC Bank | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC bank) జులై 13న సిస్టమ్‌ అప్‌గ్రేడ్‌ చేపడుతోంది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి, బ్యాంకింగ్‌ అనుభూతిని మరింత మెరుగుపరచడానికి ఈ అప్‌గ్రేడ్‌ ప్రక్రియను నిర్వహిస్తోంది. శనివారం ఉదయం 3 గంటల నుంచి ఆ రోజు సాయంత్రం 4.30 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఆ సమయంలో కొన్ని సర్వీసులు అందుబాటులో ఉండవని బ్యాంక్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 

సుమారు 13.30 గంటల పాటు ఈ అప్‌గ్రేడ్‌ ప్రక్రియ కొనసాగుతుందని, ఆ సమయంలో బ్యాంకింగ్‌, పేమెంట్‌ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పేర్కొంది. కస్టమర్లు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు జులై 12నే తగిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలని, ఏదైనా చెల్లింపులు ఉంటే ముందస్తుగానే చేసుకోవాలని సూచించింది. ఖాతాదారులపై ప్రభావం తగ్గించేందుకు సెలవు రోజున అప్‌గ్రేడింగ్‌ ప్రక్రియను చేపడుతున్నామని, దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.

వంటగ్యాస్‌ ఈకేవైసీకి తుది గడువుపై.. కేంద్ర మంత్రి క్లారిటీ

అప్‌గ్రేడింగ్‌ ప్రక్రియలో భాగంగా 13వ తేదీ ఉదయం 3 గంటల నుంచి 3.45 గంటల వరకు; ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్‌ తెలిపింది. నెట్‌ బ్యాంకింగ్‌ సేవలూ పాక్షింకంగానే అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఏటీఎం/డెబిట్‌ కార్డుకు సంబంధించి ఎంపిక చేసిన సర్వీసులు కొంత సమయం పాటు అందుబాటులో ఉండవని పేర్కొంది. క్రెడిట్‌ కార్డు సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయంది. ఏయే సర్వీసులు ఏయే సమయాల్లో అందుబాటులో ఉండనిదీ బ్యాంక్‌ ఓ టేబుల్‌ రూపంలో విడుదల చేసింది. ఆయా సర్వీసులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆ వివరాల కోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని