సరికొత్త రివార్డ్స్ ప్రోగ్రామ్ ని ప్రారంభించిన హెచ్డీఎఫ్సీ ఎర్గో..
అనేక రకాల ఆఫర్ల కోసం లేదా బీమా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు
దేశంలోని అతిపెద్ద బీమా సంస్థల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపనీ "వాల్ట్" పేరుతో సరికొత్త డిజిటల్ కస్టమర్ రివార్డ్స్ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. హెచ్డీఎఫ్సీ జనరల్ ఇన్సూరెన్స్ కంపనీ అనేది హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, జర్మనీకి చెందిన మ్యూనిచ్ ఆర్ఈ గ్రూప్ ప్రాథమిక బీమా సంస్థ అయిన ఎర్గో ఇంటర్నేషనల్ ఏజీ మధ్య ఉమ్మడి భాగస్వామ్య సంస్థ.
"వాల్ట్" ప్రోగ్రామ్ లో భాగంగా, బీమా సంస్థ తన ఆప్టిమా రీస్టోర్ హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్లను రెండేళ్ళకు పైగా పాలసీ కవరేజ్ పొందేలా చేయడం, యాక్టివ్ హెచ్డీఎఫ్సీ ఎర్గో రిటైల్ పాలసీలను కలిగి ఉండేలా చేయడం, డిజిటల్‌గా ఇంటరాక్ట్ అయ్యేలా చేయడం, నగదు రహిత నెట్వర్క్ని ఉపయోగించేలా చేయడం వంటి కొన్ని కార్యకలాపాలను రివార్డ్ పాయింట్లను అందించడం ద్వారా ప్రోత్సహిస్తుంది. నగదుకు సమానమైన ఈ రివార్డ్ పాయింట్లను ఫార్మసీ వోచర్లు, డాక్టర్ కన్సల్టేషన్లు మొదలైన అనేక రకాల వెల్నెస్ ఆఫర్ల కోసం లేదా బీమా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చునని హెచ్డీఎఫ్సీ ఎర్గో ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ప్రోగ్రాం మా ప్రస్తుత పాలసీదారులకు మరింత విలువను అందించడంలో సహాయపడడంతో పాటు పోర్టింగ్ ద్వారా ఇతర బీమా సంస్థలకు మారాలనుకునే అనేక మంది కొత్త కస్టమర్లను ఆకర్షించడంలో సహాయపడుతుందని సంస్థ ప్రతినిధి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్‌లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్‌కు క్లీన్ చిట్