FD: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 8 శాతం వడ్డీ.. HDFC కొత్త స్కీమ్‌

హెచ్‌డీఎఫ్‌సీ సీనియర్‌ సిటిజన్ల కోసం కొత్త ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ డిపాజిట్లపై 8 శాతం వడ్డీ అందిస్తోంది.

Published : 02 Mar 2023 15:08 IST

దిల్లీ: మార్టిగేజ్‌ రుణ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) సీనియర్‌ సిటిజన్ల కోసం డైమండ్‌ డిపాజిట్‌ పేరిట కొత్త ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ డిపాజిట్లపై 8% వరకు వడ్డీ రేటును అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ వెబ్‌సైట్‌ ప్రకారం.. ఈ వడ్డీ రేటు 2023 మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. డిపాజిట్ కాలవ్యవధి 75 నెలలు. ఆన్‌లైన్‌ ద్వారా డిపాజిట్‌/ రెన్యువల్‌ చేసే వారికి 0.05% అదనపు ప్రోత్సాహకం ఉంటుంది. రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్‌ మొత్తాలకు ఈ రేటు వర్తిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని