ఆర్‌బీఐ ప్రకటించిన కొన్ని గంటలకే HDFC పెంచేసింది

ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) లిమిటెడ్‌ రుణ రేట్లను 50 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. ఆర్‌బీఐ రెపో రేటును సవరించిన కొన్ని గంటలకే ఈ పెంపు నిర్ణయం తీసుకుంది.

Published : 30 Sep 2022 23:26 IST

దిల్లీ: ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) లిమిటెడ్‌ రుణ రేట్లను 50 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. ఆర్‌బీఐ రెపో రేటును సవరించిన కొన్ని గంటలకే ఈ పెంపు నిర్ణయం తీసుకుంది. హౌసింగ్‌ రుణాలకు వర్తించే రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేట్‌ (RPLR)ను ఆ సంస్థ 50 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌ 1 నుంచే పెరిగిన రేట్లు అమల్లోకి వస్తాయని ఆ సంస్థ తెలిపింది.

దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్‌బీఐ వరుసగా నాలుగోసారీ కీలకమైన రెపో రేటును 50 బేసిస్‌ పాయింట్లు శుక్రవారం పెంచింది. దీంతో రెపోరేటు 5.90కి చేరింది. 2019 ఏప్రిల్‌ తర్వాత రెపో రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ రుణ రేట్లను సవరించింది. దీంతో ఆ సంస్థ వద్ద రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐలు భారం కానున్నాయి. గడిచిన ఐదు నెలల్లో రేట్లను పెంచడం ఇది వరుసగా ఏడోసారి. ఆర్‌బీఐ నిర్ణయం నేపథ్యంలో మిగిలిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా రుణ రేట్లను సవరించనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని