Health Insurance: ఆదిత్య బిర్లా OPD యాడ్-ఆన్ కవరేజీ వివరాలు ఇవే..
వయసు ఆధారంగా ప్రీమియం రేట్లు మారతాయి.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లే వారిలో చాలామంది అవుట్ పేషెంట్ రోగులే ఉంటారు. కానీ, ఆరోగ్య బీమా కవరేజీ ప్రధానంగా ఆసుపత్రిలో చేరి కనీసం 24 గంటలు చికిత్స పొందే వారికే ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీలు వైద్యుల ఫీజులు, డయాగ్నోస్టిక్ ఛార్జీలు, హోమ్‌కేర్ ప్యాకేజీలు వంటి గృహ చికిత్స ఖర్చులను మినహాయించి ఇన్‌పేషెంట్ ఖర్చులను మాత్రమే కవర్ చేస్తున్నాయి. దీనివల్ల ప్రజలు సాధారణ వైద్య ఖర్చుల కోసం 60 శాతానికి పైగా వ్యయాన్ని జేబు నుంచే ఖర్చుపెట్టాల్సి వస్తుంది. ఈ ఖర్చులను తగ్గించడానికి ఇటీవల కొన్ని బీమా సంస్థలు ఔట్ పేషెంట్ ఖర్చులైన డాక్టర్ ఫీజులు, ఫార్మసీ వంటి ఇతర ఖర్చులతో పాటు ఆరోగ్య సేవలు పొందడానికి OPD సొల్యూషన్లను ప్రారంభించాయి. ఈ సేవల కోసం బీమా తీసుకునేటప్పుడు OPD యాడ్-ఆన్ కవరేజీతో కూడిన ఆరోగ్య బీమా తీసుకోవాలి.
OPD ఖర్చులను కవర్ చేయడానికి 'ఆదిత్య బిర్లా' ఆరోగ్య బీమా తన పాలసీదారుల కోసం OPD యాడ్-ఆన్ కవరేజీని అందిస్తోంది. ఈ OPD యాడ్-ఆన్ కవర్ పేషెంట్ డాక్టరుతో భౌతిక, వర్చ్యువల్ సంప్రదింపులు చేయడానికి అయ్యే ఖర్చులను భరిస్తుంది. డాక్టరుతో అపరిమిత సంప్రదింపులను కూడా ఈ యాడ్-ఆన్ కవర్ చేస్తుంది. ఇది gynaecology, ఆర్థోపెడిక్, పిడియాట్రిక్, ఆప్తమాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్, న్యూట్రిషనిస్ట్ వంటి నిపుణుల సంప్రదింపుల సేవలను నగదు రహితంగా అందిస్తుంది.
ఆదిత్య బిర్లా బీమా ప్రీమియంలు..
- ఏడాదికి రూ. 599 (పన్ను మినహాయించి) చెల్లిస్తే.. అపరిమిత జనరల్ మెడికల్ ప్రాక్టీషనర్ సంప్రదింపు సేవలను ప్రత్యక్షంగా పొందొచ్చు.
- ఏడాదికి రూ. 799 (పన్ను మినహాయించి) చెల్లిస్తే.. అపరిమిత జనరల్ మెడికల్ ప్రాక్టీషనర్ సంప్రదింపు సేవలను ప్రత్యక్షంగానే కాకుండా వర్చ్యువల్ అవుట్ పేషెంట్ సేవలను కూడా పొందొచ్చు.
- ఏడాదికి రూ. 999 (పన్ను మినహాయించి) చెల్లిస్తే.. పైన తెలిపిన సేవలతో పాటు gynaecology, ఆర్థోపెడిక్, పిడియాట్రిక్, ఆప్తమాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్, న్యూట్రిషనిస్ట్ వంటి నిపుణుల సంప్రదింపుల సేవలను కూడా పొందొచ్చు.
ఈ OPD యాడ్-ఆన్ కవర్లో వెయిటింగ్ పీరియడ్ లేదు. ఇది యాడ్-ఆన్ తీసుకున్న మొదటి రోజు నుంచి కవర్ చేస్తుంది. 70కు పైగా నగరాల్లో 32,000 డాక్టర్ నెట్‌వర్క్‌ను కవర్ చేస్తుంది. ఆరోగ్య బీమా తీసుకున్నప్పుడే OPD యాడ్-ఆన్ ఎంపిక చేసుకోవచ్చు. దీంతో బీమా చేసిన వారందరూ డిఫాల్ట్ గా వ్యక్తిగత ప్రాతిపదికన ప్రయోజనాలను పొందుతారు. ఈ యాడ్-ఆన్ ప్రవేశానికి కనీస, గరిష్ఠ వయసు నిభందనలు ఉంటాయి.
OPD ప్లాన్ కొనుగోలు చేసే ముందు డాక్టర్‌తో త్వరితగతిన సంప్రదింపుల కోసం తగినన్ని నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయా? లేవా? అనేది చూసుకోవాలి. ఈ సౌకర్యం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. వయసు ఆధారంగా ప్రీమియం రేట్లు మారతాయి. మీరు OPD కవరేజీని అంతర్నిర్మిత బేస్ ప్లాన్‌గా కూడా కొనుగోలు చేయవచ్చు. లేదా ప్రాథమిక పాలసీతో రైడర్‌గా కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేసే ముందు కవరేజీ, మినహాయింపులు, మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న వైద్యుల నెట్వర్క్ చెక్ చేసుకోవాలి. ఐసీఐసీఐ లాంబార్డ్ కూడా OPD యాడ్-ఆన్ కవరేజీతో బీమాను అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
చిన్న, మధ్యస్త REITS ద్వారా స్థిరాస్తిలో పెట్టుబడులు.. సురక్షితమేనా?
తరతరాలుగా భారతీయులు స్థిరాస్తి, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులను గౌరవిస్తున్నారు. మారుతున్న కాలంలో స్థిరాస్తి పెట్టుబడులకు మారో రూపమే SM REITS.. వీటి గురించి తెలుసుకోండి. -
PPF vs VPF: పీపీఎఫ్, వీపీఎఫ్‌లో ఏది బెటర్..?
PPF or VPF: వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏది బెటర్ అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాల్ని పరిశీలించాక మీ నిర్ణయం తీసుకోండి.. -
Foreign Trip: విదేశీ టూర్‌ను ఇబ్బంది లేకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి?
విదేశీ వెకేషన్‌ను ప్లాన్ చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం ఇబ్బంది లేకుండా, సజావుగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. -
Claim Ratio: ఆరోగ్య బీమా కంపెనీల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో వివిధ బీమా సంస్థలకు సంబంధించి.. ఆరోగ్య బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
కుటుంబానికి ధీమానిచ్చేలా.. బీమా పాలసీ
సంపాదించిన మొత్తంలో నుంచి పొదుపు, పెట్టుబడులకు కొంత కేటాయిస్తుంటాం. కుటుంబానికి ఆర్థికంగా అవసరమైన లక్ష్యాల సాధనకు ఇవి ఉపయోగడేలా చూసుకుంటాం. -
పన్ను ఆదా ఇలా చేద్దాం
ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వచ్చేసింది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు తమ పొదుపు,పెట్టుబడులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. -
డెట్ ఫండ్లలో మదుపు చేస్తున్నారా?
ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తుండటంతో చాలామంది సురక్షిత పథకాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిలో మదుపు చేసేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలను తెలుసుకుందాం. -
Credit cards: క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!
Credit Cards: క్రెడిట్ కార్డుల విషయంలో ఏప్రిల్ 1 నుంచి మార్పులు రానున్నాయి. రివార్డులు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో బ్యాంకులు కీలక మార్పులు చేపట్టాయి. -
Health Insurance Claims: ఆరోగ్య బీమా క్లెయిమ్ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!
Insurance claims: ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు కొన్నిసార్లు తిరస్కరణకు గురవుతుంటాయి. కాబట్టి ఈ తప్పులు చేయొద్దు.. -
Health Emergency: ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి?
జీవితంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కోడానికి మనం ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి.. -
Mutual Funds: మ్యూచువల్ ఫండ్ల ఉపసంహరణ సమస్య.. ఎన్ని రోజులు పడుతోందంటే?
మార్కెట్లలో మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్లలో ఉన్న తమ నిధులను మదుపుదార్లు ఉపసంహరించుకున్నప్పుడు నిధుల బదిలీకి వివిధ సంస్థలు కొంత సమయాన్ని తీసుకుంటున్నాయి. ఎంత మొత్తం ఉపసంహరణకు.. ఎంత సమయం తీసుకుంటున్నాయో ఇక్కడ చూడండి. -
Insurance Agent: బీమా ఏజెంట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి?
చాలా మందికి వారి వ్యక్తిగత జీవితంలో బీమా చాలా అవసరం. పాలసీ కొనుగోలు సమయంలో ఏజెంట్/అడ్వైజర్ అవసరం పడొచ్చు. వీరి గురించి ఇక్కడ తెలుసుకోండి. -
ఆరోగ్య బీమా రోజువారీ ఖర్చులను అందించేలా...
వైద్య ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా రంగంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. -
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల్లో అప్రమత్తంగా
స్టాక్ మార్కెట్ అంటేనే అనిశ్చితికి మారు పేరు. చిన్న వార్త వచ్చినా దానికి ప్రతికూలంగానో, అనుకూలంగానో స్పందిస్తుంటాయి. ఒక్క రోజులోనే మదుపరుల సంపద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరవుతుంది. -
స్థిరాస్తి రంగంలో...
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా హెచ్డీఎఫ్సీ నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ఈ నెల 21న ముగుస్తుంది. -
Health Insurance: విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధుల కోసం ఆరోగ్య బీమా
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య బీమా తప్పనిసరి. భారత్‌లో ప్రముఖ బీమా సంస్థలు విదేశీ విద్యార్థులకు అందించే బీమా సౌకర్యాలు ఇక్కడ తెలుసుకుందాం.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ