ఆరోగ్య బీమా ప్రీమియం రేట్లు ఎలా ఉన్నాయి?

బీమా అనేది ఆర్ధిక న‌ష్టాల నుండి మిమ్మ‌ల్ని ర‌క్షించే రిస్క్ మేనేజ్‌మెంట్ సాధ‌నం.

Updated : 21 Nov 2022 16:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్యంగా ఉండ‌టం ఒక వ‌ర‌మ‌నే చెప్పాలి. అనారోగ్య స‌మ‌స్య‌లేవీ ముందుగా చెప్పిరావు. ఒక్కోసారి వ్యాధి ఒక స్థాయి వ‌ర‌కు శ‌రీరంలో ఉన్నా కూడా వ్య‌క్తికి తెలియ‌క‌పోవ‌చ్చు. ఇక యాక్సిడెంట్లు అయితే ఇంటా బ‌య‌టా ఎక్క‌డైనా, ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు. ఇలా అనారోగ్యాల‌కు అన్నింటికీ సొంత జేబు నుంచి డ‌బ్బులు ఖ‌ర్చుపెడితే, బ్యాంకు బ్యాలెన్స్‌ అయిపోవడమే కాక అప్పుల పాల‌య్యే అవ‌కాశం ఉంది. వీట‌న్నిటికీ చెక్ పెట్టాలంటే ఆరోగ్య బీమా తీసుకోవ‌డం ఒక‌టే ప‌రిష్కారం. భారీగా హాస్పిట‌ల్ బిల్లులు చెల్లించ‌డానికి, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి వ్య‌క్తుల‌కు స‌హాయ‌ప‌డే అత్యంత ముఖ్య‌మైన సాధ‌నాల్లో ఆరోగ్య బీమా ఒక‌టి.

చాలా ఇన్సూరెన్స్ సంస్థ‌లు ఆరోగ్య బీమా పాల‌సీల‌ను వినియోగ‌దారుల‌కు అమ్ముతున్నాయి. ఈ ఆరోగ్య బీమా పాల‌సీల‌ను కొనుగోలు చేసేవారు చౌకైన ప్రీమియంలు, మంచి నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రులు క‌వ‌ర్‌చేసే సంస్థ‌ల వ‌ద్ద పాల‌సీల‌ను కొనుగోలు చేస్తే మంచిది. న‌గ‌దు ర‌హిత ఆరోగ్య బీమా పాల‌సీల‌ను ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డుతున్నారు. ఆరోగ్య బీమా పాలసీ ఉన్న వారు బీమా కంపెనీల నెట్‌వ‌ర్క్ ప‌రిధిలో లేని ఆసుప‌త్రుల్లో జాయిన్ అయితే ముందు ఆసుప‌త్రికి బిల్లు చెల్లించి త‌ర్వాత బీమా కంపెనీ నుంచి ఆ బిల్లు క్లెయిమ్ చేసుకోవాలి. దీనినే రీయింబ‌ర్స్‌మెంట్ అంటారు. కొవిడ్ కార‌ణంగా చ‌రిత్ర‌లో అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కార‌ణంగా ఆరోగ్య ప్రాముఖ్య‌త‌ను ఎవ‌రూ విస్మ‌రించ‌లేక‌పోతున్నారు. ఈ నేపథ్యంలో రూ. 5 ల‌క్ష‌ల ఆరోగ్య బీమా పాల‌సీకి వివిధ బీమా కంపెనీలు అందించే పాలసీ ప్రీమియంలను దిగువ టేబుల్‌లో ఇస్తున్నాం.

నోట్‌: ఈ  డేటా 2022 మార్చి 2 నాటిది. నివసించే ప్రాంతం, వయసు బట్టి ప్రీమియంలో మార్పులు ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని