జియో-బీపీ కేంద్రాల్లో హీరోఎలక్ట్రిక్‌ వాహనాలకు ఛార్జింగ్‌, బ్యాటరీ స్వాపింగ్‌ సేవలు

ఛార్జింగ్‌ మౌలికవసతుల వినియోగం నిమిత్తం జియో-బీపీతో హీరో ఎలక్ట్రిక్‌ ఒప్పందం కుదుర్చుకొంది....

Published : 25 Aug 2022 19:39 IST

దిల్లీ: ఛార్జింగ్‌ మౌలికవసతుల వినియోగం నిమిత్తం జియో-బీపీతో హీరో ఎలక్ట్రిక్‌ ఒప్పందం కుదుర్చుకొంది. దీంతో హీరో ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనదారులు ఇకపై జియో-బీపీ స్టేషన్లలో ఛార్జింగ్‌, బ్యాటరీ స్వాపింగ్‌ సేవల్ని పొందొచ్చు. రానున్న రోజుల్లో విద్యుత్తు వాహన వినియోగదారుల కోసం మరిన్ని మెరుగైన వసతులను అందుబాటులోకి తీసుకొస్తామని ఒప్పందం సందర్భంగా ఇరు కంపెనీలు ప్రకటించాయి.

జియో-బీపీ పల్స్‌ పేరిట జియో-బీపీ ఛార్జింగ్‌, స్వాపింగ్‌ స్టేషన్లను నిర్వహిస్తోంది. అలాగే పల్స్‌ యాప్‌ ద్వారా దగ్గర్లోని స్టేషన్లను గుర్తించి సేవల్ని పొందొచ్చు. భారత్‌లో అతిపెద్ద ఈవీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ కంపెనీ మౌలిక వసతుల్ని అభివృద్ధి చేస్తోంది. మరోవైపు హీరో ఎలక్ట్రిక్‌ లుధియానాలో తమ తయారీ కేంద్రం నుంచి వివిధ రకాల విద్యుత్తు స్కూటర్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని