Hero Electric SBI: హీరో ఎలక్ట్రిక్‌ వినియోగదారులకు ఎస్‌బీఐ రుణాలు!

తమ వినియోగదారులకు రిటైల్‌ రుణాలు అందించేందుకు వీలుగా ప్రముఖ విద్యుత్తు వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐతో చేతులు కలిపింది....

Published : 11 Feb 2022 19:04 IST

దిల్లీ: తమ వినియోగదారులకు రిటైల్‌ రుణాలు అందించేందుకు వీలుగా ప్రముఖ విద్యుత్తు వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్‌.. బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐతో చేతులు కలిపింది. తక్కువ వడ్డీరేటుకు, ఎలాంటి చిక్కులు లేకుండా ఇకపై హీరో ఎలక్ట్రిక్ వాహనాల (EV)ను సొంతం చేసుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. విద్యుత్తు వాహనాలకు గిరాకీ పుంజుకుంటున్న నేపథ్యంలో వినియోగదారులకు సహాయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈవీలను కొనుగోలు చేయాలనుకుంటున్నవారు ఆకర్షణీయమైన ఆఫర్లు, పథకాల కోసం చూస్తున్నారని అభిప్రాయపడింది.

దీనిపై ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ దేవేంద్ర కుమార్‌ మాట్లాడుతూ... భారత్‌ను స్వచ్ఛ ఇంధనం వైపు నడపడంలో తమ వంతు కృషిగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తక్కువ ఈఎంఐలతో విద్యుత్తు వాహనాలు ప్రజలకు మరింత అందుబాటు ధరల్లో చేరువ కానున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు