Hero MotoCorp: ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌.. హీరోమోటోకార్ప్‌ ప్రకటన!

హీరో మోటాకార్ప్‌ (Hero MotoCorp) కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ఉద్యోగులందరికీ వీఆర్‌ఎస్‌ (VRS) ప్రకటించింది. సంస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

Published : 05 Apr 2023 19:14 IST

దిల్లీ: ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) సంస్థ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (VRS) ప్రకటించింది. సంస్థను భవిష్యత్తు అవసరాలకు తగ్గినట్లుగా మార్చడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదలచేసింది.

‘‘పరిశ్రమల రంగంలో జరుగుతున్న మార్పులు, సంస్థను రోబో ఆధారిత ఉత్పాదకత వైపు మళ్లించాలనే లక్ష్యం, ఉద్యోగుల సంక్షేమం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని హీరో మోటోకార్ప్‌ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ప్రకటిస్తున్నాం. ఇది సంస్థలోని ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. ఇందులో భాగంగా ఉద్యోగులకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్, వేరియబుల్‌ పే, మెడికల్‌ కవరేజ్‌, కంపెనీ అందించే కారుకు అద్దె చెల్లింపులు వంటి వాటితోపాటు ఇతర ప్రోత్సహాకాలు ఉంటాయని’’ హీరో మోటోకార్ప్‌ తెలిపింది. 

హీరో మోటోకార్ప్‌ మార్చి నెలలో ౫,౧౯,౩౪౨ యూనిట్లు విక్రయించింది. గతేడాది మార్చి నెల అమ్మకాలతో పోలిస్తే ఇది ౧౫ శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది. మరోవైపు ద్విచక్ర వాహనాల తయారీని రోబో ఆధారిత విభాగంగా మార్చి, మరింత ఉత్పాదకత సాధించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో భాగంగానే కొంత కాలంగా సంస్థలో ఉద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు హీరో మోటోకార్ప్‌ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో గత రెండేళ్లలో మార్కెటింగ్‌, ఆర్‌అండ్‌డీ, హెచ్‌ఆర్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు విభాగాలకు కొత్త సీఈవోలను సంస్థలోని వారిని ఎంపిక చేసింది. మరోవైపు ఫైనాన్స్‌, ఎలక్ట్రిక్‌ వాహన విభాగానికి బయటి వ్యక్తులను సీఈవోలుగా నియమించింది. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని