Vida V1: హీరో మోటాకార్ప్ తొలి ఈవీ.. విడా వీ1 డెలివరీలు షురూ..!
భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం విడా లక్ష్యమని హీరో మోటార్‌కార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్ అన్నారు. కంపెనీ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ1 డెలివరీలను కంపెనీ ప్రారంభించింది.
దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్ కార్ప్ (Hero MotoCorp) తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ1 (VIDA V1) డెలివరీలను శుక్రవారం ప్రారంభించింది. మొదటి స్కూటర్‌ను బెంగళూరు షోరూంలో కొనుగోలుదారులకు అందించింది. దిల్లీ, జయపుర నగరాల్లో కూడా ముందుస్తుగా బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు వీటిని అందిచనున్నారు. హీరో మోటార్‌కార్ప్ ఈవీ విభాగం నుంచి వస్తోన్న తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.
‘‘భవిష్యత్తు రవాణా అవసరాలకు తగినట్లుగా, వినియోగదారులకు లబ్ధిచేకూర్చేలా.. పర్యావరణానికి హాని కలిగించని వాహనాలు తయారు చేయడం విడా లక్ష్యం. ఈ రోజు వినియోగదారులకు విడా వీ1 వాహనాలు అందించడం ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగామని భావిస్తున్నాం’’ అని హీరో మోటార్‌కార్ప్ ఛైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ ఈ సందర్భంగా తెలిపారు.
హీరో మోటాకార్ప్ ఈ ఏడాది అక్టోబరులో విడా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ఇస్తున్నారు. దీన్ని మూడు వేర్వేరు పద్ధతుల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 163 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఈ స్కూటర్ అత్యధికంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. రెండు వేరియంట్లలో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు. విడా వీ1ప్లస్ ధర ₹ 1.35 లక్షలు, విడా వీ1 ప్రో ధర ₹ 1.46 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
Sports News
Rishabh Pant: రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం ఇవ్వనున్న దిల్లీ క్యాపిటల్స్!
-
World News
Rishi Sunak: ఇంగ్లాండ్ ఆటగాళ్లతో క్రికెట్ ఆడిన రిషిసునాక్.. వీడియో వైరల్
-
India News
America: అశ్లీల వీడియోలు సరఫరా.. భారతీయుడికి 188 నెలల జైలు..!
-
Sports News
Surya - Samson: సూర్య కుమార్‌ను సంజూ శాంసన్‌తో పోల్చొద్దు... ఎందుకంటే: కపిల్ దేవ్
-
Movies News
Social Look: నెల తర్వాత నివేదా పోస్ట్.. కీర్తి సురేశ్ ‘వెన్నెల’ ఎఫెక్ట్!