Hero MotoCorp: ఫిలిప్పైన్స్‌ మార్కెట్‌లోకి ‘హీరో’.. టెర్రాఫర్మాతో భాగస్వామ్యం

దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరోమోటోకార్ప్‌ ఫిలిప్పైన్స్‌కు చెందిన టెర్రాఫర్మా కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తద్వారా ఆ దేశ విపణిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 

Published : 26 Oct 2022 22:43 IST

దిల్లీ: దేశీయ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరోమోటోకార్ప్‌ ఫిలిప్పైన్స్‌ విపణిలోకి ప్రవేశించనుంది. ఈ మేరకు అక్కడి స్థానిక సంస్థ టెర్రాఫర్మాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కంపెనీ హీరో మోడళ్ల అసెంబ్లింగ్‌, పంపిణీ కార్యకలాపాలను చేపట్టనుంది. ఇప్పటికే కొలంబియన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌తో కూడా హీరోమోటోకార్ప్‌ ఒప్పందం కుదుర్చుకొంది. దానితో పాటు తాజాగా టెర్రాఫర్మా కూడా ఫిలిప్పైన్స్‌లో ‘హీరో’ తరఫున పనిచేయనుంది.

లగునా నగరంలో ఉన్న తయారీ కేంద్రంలోనే కొత్తగా 29 వేల చదరపు మీటర్ల స్థలంలో మరో ప్లాంట్‌ను టెర్రాఫర్మా ఏర్పాటు చేయనుంది. 2024 ద్వితీయార్ధంలో అక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం హీరో మోటోకార్ప్‌ ఆసియా, ఆఫ్రికా, పశ్చిమాసియా, దక్షిణ అమెరికా, సెంట్రల్‌ అమెరికాలో కలిపి మొత్తం 43 దేశాల్లో తమ కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి మొత్తం 8 తయారీ కేంద్రాలున్నాయి. వీటిలో ఆరు భారత్‌లో; కొలంబియా, బంగ్లాదేశ్‌లో ఒక్కోటి ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని