Hero MotoCorp: జీరో మోటార్‌సైకిల్స్‌తో చేతులు కలిపిన హీరోమోటోకార్ప్‌

Hero MotoCorp: కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ‘జీరో’లో 60 మిలియన్‌ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టేందుకు 2022 సెప్టెంబరులో హీరోమోటోకార్ప్‌ బోర్డు ఆమోదం తెలిపింది.

Published : 06 Mar 2023 13:59 IST

దిల్లీ: ప్రీమియం విద్యుత్‌ మోటార్‌సైకిల్స్‌ కోసం అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న జీరో మోటార్‌సైకిల్స్‌లో ఒప్పందం కుదుర్చుకున్నట్లు హీరోమోటోకార్ప్‌ తెలిపింది. పవర్‌ ట్రెయిన్స్‌, ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్స్‌ తయారు చేయడంలో ‘జీరో’కు ఉన్న అనుభవం తమకు ఉపయోగపడుతుందని పేర్కొంది. సోర్సింగ్‌, మార్కెటింగ్‌లోనూ సహకారం లభిస్తుందని తెలిపింది.

కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న ‘జీరో’లో 60 మిలియన్‌ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టేందుకు 2022 సెప్టెంబరులో హీరోమోటోకార్ప్‌ బోర్డు ఆమోదం తెలిపింది. హీరోమోటోకార్ప్‌ విడా వీ1 స్కూటర్‌తో విద్యుత్తు స్కూటర్ల విభాగంలోకి ప్రవేశించింది. బెంగళూరు, దిల్లీ, జైపుర్‌లో పబ్లిక్‌ ఛార్జింగ్‌ మౌలిక వసతులనూ ప్రారంభించింది. ఇప్పటికే అక్కడ 300 ఛార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని