Hero MotoCorp: ఈ-బైక్స్‌ తయారీకి అమెరికా కంపెనీలో హీరో మోటోకార్ప్‌ పెట్టుబడి

అమెరికాకు చెందిన జీరో మోటార్‌ సైకిల్స్‌లో హీరో మోటోకార్ప్‌ పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది.

Published : 29 Sep 2022 21:06 IST

దిల్లీ:  ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) విద్యుత్‌ వాహనాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన జీరో మోటార్‌ సైకిల్స్‌లో ఆ కంపెనీ రూ.490 కోట్లు (60 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. జీరో మోటార్‌ సైకిల్స్‌తో కలిసి ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిళ్లు తీసుకురానుంది. 

కాలిఫోర్నియాకు చెందిన జీరో మోటార్‌ సైకిల్స్‌.. ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిళ్లు, పవర్‌ ట్రెయిన్స్‌ను తయారు చేస్తోంది. 2021లో ఆ కంపెనీ ఆదాయం 60.7 మిలియన్‌ డాలర్లుగా ఉంది. మరోవైపు అక్టోబర్‌ 7న విడా బ్రాండ్‌పై తొలి విద్యుత్‌ స్కూటర్‌ను తీసుకొచ్చేందుకు హీరో మోటోకార్ప్‌ సిద్ధమవుతోంది. మరోవైపు ఏథర్‌ ఎనర్జీలో ఇప్పటికే 35 శాతం వాటా కలిగి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని