Fixed Deposit: కంపెనీ ఎఫ్‌డీలపై 8 శాతం వరకు వడ్డీ.. జాబితా ఇదే..

దేశంలో ప్రముఖ కంపెనీల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు ఇక్కడ ఉన్నాయి.

Published : 18 Mar 2023 15:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీని పొందాలని ప్లాన్‌ చేస్తున్నట్లయితే..  మీరు కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను పరిశీలించవచ్చు. బ్యాంకు డిపాజిట్లతో పోలిస్తే.. కంపెనీ డిపాజిట్లు అధిక వడ్డీ రేటును అందిస్తాయి. మార్కెట్‌ పెట్టుబడుల జోలికి వెళ్లని సాధారణ డిపాజిటర్లు, సీనియర్‌ సిటిజన్లు కూడా కంపెనీల ఎఫ్‌డీలలో మదుపు చేయడానికి యోచించవచ్చు. క్యుములేటివ్‌ కంపెనీ ఎఫ్‌డీలు పెట్టుబడిదారులకు ఎఫ్‌డీ కాలవ్యవధి ముగిసే సమయానికి అసలు, వడ్డీతో పాటు చెల్లిస్తాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కూడా ఈ డిపాజిట్లను తీసుకోవచ్చు. ఈ డిపాజిట్లకు నామినీ సౌకర్యం కూడా ఉంది.

వివిధ కంపెనీ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు, కాలవ్యవధి, రేటింగ్స్‌ ఇవీ

గమనిక: బ్యాంకు ఎఫ్‌డీలపై వర్తించే రూ.5 లక్షల బీమా (డీఐసీజీసీ) సౌకర్యం కంపెనీ డిపాజిట్లకు ఉండదు. కాబట్టి, మదుపు చేసేవారు ‘ఏఏఏ’ రేటింగ్‌ ఉన్న కంపెనీ డిపాజిట్లపై పెట్టుబడి పెట్టడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని