హిందాల్కో నికర లాభం రూ.2411 కోట్లు

హిందాల్కో 4వ త్రైమాసిక ఫలితాలను ఈ రోజు ప్రకటించింది.

Published : 24 May 2023 16:39 IST

దిల్లీ: అల్యూ మినియం తయారీదారైన హిందాల్కో మార్చితో ముగిసిన 4వ త్రైమాసికంలో రూ.2,411 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.3,860 కోట్లతో పోలిస్తే.. ఇది 37 శాతం తక్కువ. సంస్థ ఏకీకృత EBITDA సంవత్సరానికి 23% తగ్గి రూ.5,818 కోట్ల వద్ద ఉంది. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.55,764 కోట్లకు చేరుకుంది. బలమైన మార్కెట్‌ డిమాండ్‌, స్థిరమైన కార్యకలాపాలు, అధిక విలువ ఆధారిత ఉత్పత్తుల కారణంగా కాపర్ వ్యాపారం మంచి అభివృద్ధి సాధించిందని హిందాల్కో ఇండస్ట్రీస్‌ ఎండీ సతీశ్‌ పాయ్‌ తెలిపారు. ప్రతి ఈక్విటీ షేర్‌కు రూ.3 డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని