హిండెన్‌బర్గ్‌ ఎఫెక్ట్‌.. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీని దాటేసిన అంబానీ!

ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. దీంతో ఆయన అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీని దాటి భారత సంపన్న వ్యక్తిగా అవతరించారు.

Published : 02 Feb 2023 01:19 IST

ముంబయి: ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. దీంతో ఆయన అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీని దాటి భారత సంపన్న వ్యక్తిగా అవతరించారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం ప్రపంచ కుబేరుల జాబితాలో 0.19 శాతం సంపద వృద్ధితో అంబానీ 84.5 బిలియన్‌ డాలర్లతో 9వ స్థానంలో ఉండగా, 84.1 బిలియన్‌ డాలర్లతో అదానీ 10వ స్థానంలో  కొనసాగుతున్నారు. 

ఈ జాబితాలో కొద్దిరోజుల క్రితం వరకు అదానీ గ్రూప్‌ ఛైర్మన్ గౌతమ్‌ అదానీ మూడో స్థానంలో  కొనసాగిన సంగతి తెలిసిందే. తాజాగా హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికతో అదానీ గ్రూప్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో అదానీ సంపద 34 బిలియన్‌ డాలర్లుకు పైగా కోల్పోయి 11వ స్థానానికి పరిమితమయ్యారు. గడిచిన 24 గంటల్లో అదానీ సంపద కొంత మేరకు పెరగగా, ఆయన ప్రస్తుతం 10వ స్థానంలో కొనసాగుతున్నారు. 

గత వారం అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ అదానీ సంస్థ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లో మోసాలు చేస్తోందంటూ ఇచ్చిన నివేదిక మార్కెట్‌ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారి తీసింది. ఈ నివేదికలోని ఆరోపణలను అదానీ గ్రూప్‌ తోసిపుచ్చింది. హిండెన్‌బర్గ్‌ నివేదికకు బదులుగా 413 పేజీల్లో తన స్పందనను తెలియజేసింది. తమ నివేదికలో 82 ప్రశ్నలడిగితే అందులో 62 ప్రశ్నలకు అదానీ గ్రూప్‌ సమాధానాలు చెప్పలేదని, కీలకమైన విషయాల నుంచి దృష్టి మరల్చేందుకు ప్రయత్నిస్తోందని హిండెన్‌బర్గ్‌ తెలిపింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు