MOU: కలిసి పనిచేయనున్న హిందుస్థాన్‌ జింక్‌, AEsir టెక్నాలజీస్‌

జింక్‌ బ్యాటరీ టెక్నాలజీలో ప్రత్యేకత కలిగిన అమెరికన్‌ సంస్థ AEsir టెక్నాలజీస్‌తో  హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌ కలిసి పనిచేయనుంది.

Published : 21 Jun 2024 19:59 IST

దేశంలో అతిపెద్ద జింక్‌ ఉత్పత్తిదారైన హిందుస్థాన్‌ జింక్‌ లిమిటెడ్‌.. జింక్‌ బ్యాటరీ టెక్నాలజీలో ప్రత్యేకత కలిగిన అమెరికన్‌ సంస్థ AEsir టెక్నాలజీస్‌ ఇంక్‌తో అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది. శుక్రవారం కుదుర్చుకున్న MoU ప్రకారం హిందుస్తాన్‌ జింక్‌.. AEsirకు జింక్‌ను సరఫరా చేస్తుంది. జింక్‌ ఆధారిత బ్యాటరీలు.. శక్తివంతమైన పవర్‌ స్టోరేజ్‌ సొల్యూషన్స్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. తక్కువ నిర్వహణ ఖర్చుతో అధిక శక్తిని అందజేయడమే కాకుండా, పునర్వినియోగానికి అనువైనవి. అలాగే స్థిరమైనవి, పర్యవరణ అనుకూలమైనవి కూడా.

ఈ బ్యాటరీలు అగ్ని వ్యాప్తిని నిరోధించే పదార్ధాలతో తయారుచేస్తారు. గాలి, నీటికి ఈ బ్యాటరీలు ప్రతిస్పందించవు. విషపూరిత పొగలను ఉత్పత్తి చేయవు. వీటి జీవితకాలం 20 ఏళ్ల ఉంటుందని, తుప్పు నిరోధకతను కలిగి ఉంటాయని హిందుస్థాన్‌ జింక్‌ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. AEsirకు సంబంధించిన నికెల్‌ జింక్‌ బ్యాటరీలను హై ఎండ్‌ డిఫెన్స్‌ సెక్టార్‌, పునరుత్పాదక శక్తి యూనిట్లు, డేటా సెంటర్లు, 5జీ టెలికాం వంటి కీలకమైన మౌలిక సదుపాయాలున్న ప్రదేశాలలో ఉపయోగిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని