Hiring in IT sector: లేఆఫ్‌ల మధ్య భారత్‌లో పుంజుకున్న ఐటీ నియామకాలు!

Hiring in IT sector: జవనరితో పోలిస్తే ఫిబ్రవరిలో ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల సంఖ్య 10 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది.

Updated : 01 Mar 2023 17:58 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా టెక్‌ రంగంలో ఉద్యోగుల తొలగింపులు (Layoffs) కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో భారత ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాల్లో (Hiring in IT Sector) వృద్ధి నమోదు కావడం ఊరట కలిగిస్తోంది. 2023 ఫిబ్రవరి నియామకాల్లో 10 శాతం వృద్ధి నమోదైనట్లు ‘నౌకరీ జాబ్‌స్పీక్‌’ నివేదిక వెల్లడించింది.

జవనరితో పోలిస్తే ఫిబ్రవరిలో ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల సంఖ్య 10 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ప్రత్యేక నైపుణ్యాలు అవసరమయ్యే అనలిటిక్స్‌ మేనేజర్స్‌, బిగ్‌ డేటా ఇంజినీర్స్‌, క్లౌడ్‌ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ క్యూఏ టెస్టర్స్‌ వంటి ఉద్యోగాలకు డిమాండ్‌ గణనీయంగా పెరిగినట్లు వెల్లడించింది. డెవాప్స్‌, డెవ్‌సెక్‌ ఇంజినీర్లకు సైతం గిరాకీ ఉన్నట్లు తెలిపింది. డేటా సైంటిస్ట్‌లు, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లతో పోలిస్తే పైన తెలిపిన ఉద్యోగాలకే డిమాండ్‌ అధికంగా ఉన్నట్లు పేర్కొంది.

స్థిరాస్తి, ఆతిథ్య సేవలు, ఆరోగ్య సంరక్షణ రంగాల్లోనూ ఉద్యోగుల డిమాండ్‌లో రెండంకెల వృద్ధి నమోదైనట్లు నౌకరీ నివేదిక తెలిపింది. బ్యాంకింగ్‌, బీపీఓ, రిటైల్‌ రంగాల్లోనూ ఉద్యోగులకు క్రితం నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో డిమాండ్‌ పెరిగినట్లు వెల్లడించింది. చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, పుణెలో నియామకాలు జోరుగా సాగినట్లు పేర్కొంది. వర్ధమాన నగరాలైన కోయంబత్తూర్‌, చండీగఢ్‌లోనూ ఉద్యోగుల నియామకాలు పుంజుకున్నట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని