Sports bike: హోండా నుంచి అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ బైక్ @ ₹16 లక్షలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (HMSI) భారత మార్కెట్లోకి మరో కొత్త బైక్‌ను విడుదల చేసింది.

Updated : 17 Mar 2022 20:27 IST

దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (HMSI) భారత మార్కెట్లోకి మరో కొత్త బైక్‌ను విడుదల చేసింది. సరికొత్త ‘ఆఫ్రికా ట్విన్‌’ 2022 అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ బైక్‌ను తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధరను రూ.16.01 లక్షలుగా (ఎక్స్‌ షోరూమ్‌) కంపెనీ నిర్ణయించింది. కంపెనీకి చెందిన బిగ్‌ వింగ్‌ టాప్‌లైన్‌ డీలర్‌షిప్స్‌ వద్ద బుకింగ్స్‌ను గురువారం నుంచి ప్రారంభించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ బైక్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్‌ ధర రూ.16.01 లక్షలు కాగా.. డ్యుయల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌ ధరను రూ.17.55 లక్షలుగా కంపెనీ పేర్కొంది. సీకేడీ రూట్‌లో (విడిభాగాలు తీసుకొచ్చి తయారుచేయడం) దీన్ని భారత మార్కెట్లో విక్రయించనున్నట్లు హోండా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ స్పోర్ట్స్‌ బైక్‌లో 1082.96 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఏబీఎస్‌, హెచ్‌ఎస్‌టీసీ (హోండా సెలెక్టబుల్‌ టార్క్‌ కంట్రోల్‌), బ్లూటూత్‌ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 2017లో విడుదలైనప్పటి నుంచి వాహనదారులకు ఆఫ్రికా ట్విన్‌ అడ్వెంచర్‌ రైడింగ్‌ అనుభూతిని అందిస్తోందని, ఇప్పుడు మరింత మెరుగ్గా 2022 ఆఫ్రికా ట్విన్‌ అడ్వెంచర్‌ బైక్‌ సిద్ధమైందని హెచ్‌ఎంఎస్‌ఐ డైరెక్టర్‌ యుద్వీందర్‌ సింగ్‌ గులేరియా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని