Home Loans: హోమ్‌లోన్‌పై వడ్డీ రేట్లు.. ఏ బ్యాంకులో ఎంత?

ఇంటి కొనుగోలు, నిర్మాణానికి భారీ ఎత్తున పెట్టుబడి ఎంతో అవసరం, దీనికి చాలా బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో రుణాలు ఇస్తున్నాయి. వాటి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Updated : 15 Nov 2022 14:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్‌బీఐ రెపోరేటు పెంపుతో బ్యాంకుల రుణ రేట్లు పెరిగినప్పటికీ.. అన్ని రుణాల కంటే కూడా ఇంటి రుణాల వడ్డీ రేట్లు ఇప్పటికీ తక్కువే. ఈ రుణాలు అధిక విలువతో కూడినవే గాక, దీర్ఘకాల ఈఎంఐలు కలిగి ఉంటాయి. ఇల్లు ఎలాగు హామీగా ఉంటుంది కాబట్టి ఈ గృహా రుణాలను బ్యాంకులు కూడా బాగానే ప్రొత్సహిస్తున్నాయి. 750 అంతకన్నా ఎక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్న వారికి బ్యాంకులు వసూలుచేసే వడ్డీ రేట్లు 7.50% నుంచి మొదలవుతున్నాయి. కొన్ని బ్యాంకులు స్వల్పకాలానికి ప్రాసెసింగ్‌ ఫీజులను కూడా మాఫీ చేస్తున్నాయి.

అర్హత

ఇంటి రుణం తీసుకునేవారు తిరిగి చెల్లించే ఈఎంఐ సామర్థ్యాన్ని బట్టి రుణ మొత్తాన్ని ఎంచుకోవాలి. బ్యాంకులు మీ టేక్‌-హోమ్‌ జీతంలో 40% వరకు ఈఎంఐలుగా ఉండడానికి అనుమతిస్తాయి. అర్హతలేని అధిక మొత్తానికి రుణ దరఖాస్తు చేస్తే, బ్యాంకులు తిరస్కరిస్తాయి. కాబట్టి, ఎవరైనా వారి రుణ అర్హతను ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత డౌన్‌ పేమెంట్‌ కోసం డబ్బును ఏర్పాటు చేసుకోవడం సులభం అవుతుంది. మొత్తం ఆస్తి విలువలో 20% డౌన్‌ పేమెంట్‌గా చెల్లిస్తే రుణ ఒత్తిడి, ఈఎంఐ తగ్గుతుంది.

కొన్ని ప్రముఖ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు, ఈఎంఐ వివరాలు ఇవీ..

గమనిక: ఈ డేటా 2022 నవంబర్‌ 9 నాటిది. పట్టికలో బ్యాంకులు తెలిపిన అత్యల్ప వడ్డీ రేట్లనే ఇవ్వడం జరిగింది. రుణ మొత్తం, రుణ కాలవ్యవధి, రుణగ్రహీతల ఆదాయం, క్రెడిట్‌ స్కోరును బట్టి వడ్డీ రేట్లు మారొచ్చు. ప్రాసెసింగ్‌ ఫీజులు, ఇతర రుసుములు ఈఎంఐలో కలపలేదు. పట్టికలో ఉన్న రుణ మొత్తం ఒక సూచిక మాత్రమే.. తక్కువ, ఎక్కువ రుణ మొత్తాన్ని కూడా ఎంచుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని