గృహ రుణాల వ‌డ్డీ రేట్లు, ఈఎంఐలు ఏ బ్యాంకులో ఎంత?

సొంత ఇంటి గురించి ఆలోచించేట‌ప్పుడు నెల నెలా చెల్లించే `ఈఎంఐ`ల మొత్తం గురించి తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం.

Updated : 28 Jun 2022 15:57 IST

సొంత గృహం అనేట‌ప్ప‌టికీ ప్ర‌తి ఒక్క‌రికి దానిని నిర్మించే ముందు గృహ రుణం గురించే ఆలోచ‌న వ‌స్తుంది. గృహానికి ఖ‌ర్చు కూడా క‌నీసం ల‌క్ష‌ల్లో ఉంటుంది. ఇల్లు కొన‌డం వంటి ముఖ్య‌మైన విష‌యాన్ని ఆలోచ‌న‌ చేసేట‌ప్పుడు నెల నెలా చెల్లించే `ఈఎంఐ`ల మొత్తం గురించి తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం.

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పాల‌సీ రేట్ల‌ను సంబంధిత నెల‌ల్లో 40, 50 బేసిస్ పాయింట్లు పెంచిన నేప‌థ్యంలో రెండు నెల‌ల్లో రుణ రేట్ల‌ను వ‌రుస‌గా 2 సార్లు పెంపుద‌ల చేసింది. రెపో రేటుతో అనుసంధానించ‌బ‌డిన వివిధ గృహ రుణ మొత్తాల‌పై 90 బీపీఎస్ రెపో రేటు పెంపు ప్ర‌భావంతో వ‌డ్డీ రేట్లు పెర‌గ‌డం వ‌ల్ల `ఈఎంఐ`ల పెరుగుద‌లతో గృహ రుణ ఈఎంఐలు కొన్ని బ్యాంకులు స్వ‌ల్పంగాను, కొన్ని బ్యాంకులు 1% వ‌ర‌కు పెంచాయి. ఆర్‌బీఐ రెపోరేటును పెంచిన‌ప్ప‌టికీ గృహ కొనుగోలుకు నిధులు స‌మ‌కూర్చుకోవ‌డానికి ప్ర‌స్తుత వ‌డ్డీ రేట్లు ఇంకా స‌ర‌స‌మైన ధ‌ర‌ల్లో ఉన్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అనేక ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులు గృహ రుణాల‌ను స‌ర‌స‌మైన వ‌డ్డీ రేట్ల‌కు అందిస్తున్నాయి.

బ్యాంకులు పెంచిన గృహ రుణ వ‌డ్డీ రేట్ల‌తో తీసుకునే రుణానికి ప్ర‌తి నెలా `ఈఎంఐ` ఎంత చెల్లించాలో గృహ రుణాల‌కు ప్ర‌య‌త్నించేవారు త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి. రూ. 30, 50 ల‌క్ష‌ల గృహ రుణాల‌కు.. 20 సంవ‌త్స‌రాల‌ కాల వ్య‌వ‌ధికి ప్ర‌తి నెలా `ఈఎంఐ` ఎంత చెల్లించాలో ఈ క్రింది ప‌ట్టిక‌లో ఉంది.

గ‌మ‌నిక :  తీసుకునే గృహ రుణాన్ని బ‌ట్టీ బ‌్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అందించే అతి త‌క్కువ వ‌డ్డీ రేటు ఈ ప‌ట్టిక‌లో చూప‌బ‌డింది. రుణ కాల వ్య‌వ‌ధి, ఎల్‌టీవీ (లోన్ టు వాల్యూ), క్రెడిట్ స్కోర్‌, బ్యాంక్ నిబంధ‌న‌లు, ష‌ర‌తులు వంటి అంశాల‌పై ఆధార‌ప‌డి గృహ రుణ వ‌డ్డీ రేటు మార‌వ‌చ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని