honda: హోండా మోటార్‌ సైకిల్స్‌ వర్చువల్‌ షోరూమ్‌ ప్రారంభం

హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ సోమవారం తొలి ‘హోండా బిగ్‌ వింగ్‌ వర్చువల్‌ షోరూమ్‌’ను ప్రారంభించింది. వినియోగదారులకు కాంటాక్ట్‌ లెస్‌ సేవలు అందించేందుకు దీ

Updated : 10 Dec 2021 13:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  హోండా మోటార్‌ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ సోమవారం తొలి ‘హోండా బిగ్‌ వింగ్‌ వర్చువల్‌ షోరూమ్‌’ను ప్రారంభించింది. వినియోగదారులకు కాంటాక్ట్‌ లెస్‌ సేవలు అందించేందుకు దీనిని ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ షోరూమ్‌లో కస్టమర్లకు 360 డిగ్రీల్లో వర్చువల్‌ ప్రొడక్ట్‌ డెమో అందిస్తారు. ఆన్‌లైన్‌  డాక్యుమెంటేషన్‌, డైరెక్ట్‌ టు హోమ్‌ డెలివరీ, వర్చువల్‌ చాట్‌ సపోర్ట్‌ వంటి పలు సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. 

వినియోగదారులు ఉన్న లొకేషన్‌ ఆధారంగా వారు డీలర్లను ఎంచుకొనే సౌకర్యం కూడా ఇందులో ఉంది. ‘‘మా వర్చువల్‌ షోరూమ్‌ ప్రారంభంతో వినియోగదారులకు మరింత దగ్గర అయ్యాం. అదే సమయంలో వారి భద్రతను దృష్టిలో పెట్టుకొన్నాం’’ అని హోండా విక్రయాల విభాగం డైరెక్టర్‌ యదువీందర్‌ సింగ్‌ గులేరియా పేర్కొన్నారు.  బిగ్‌వింగ్‌ నెట్‌వర్క్‌తో వీటికి మరిన్ని సౌకర్యాలు, హంగులు జోడించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని