Honda: SP 125 మోటార్‌ సైకిల్‌ను ప్రారంభించిన హోండా

ఏప్రిల్‌ నెల నుంచి అమలయ్యే ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా కొత్త మోటార్‌ సైకిల్‌ను ప్రారంభించిన హోండా మోటార్‌ సైకిల్‌ & స్కూటర్‌ ఇండియా(HMSI).

Updated : 03 Apr 2023 05:32 IST

హోండా మోటార్‌ సైకిల్‌ & స్కూటర్‌ ఇండియా(HMSI) కొత్తగా SP 125 మోటార్‌ సైకిల్‌ను ప్రవేశపెట్టింది. 2023 హోండా SP 125, రూ.85,131 ఎక్స్‌-షోరూం ధరతో ప్రారంభమవుతుంది. ఈ 125సీసీ ప్రీమియం కమ్యూటర్‌ మోటార్‌సైకిల్‌ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా OBD-2 కంప్లైంట్‌ ఇంజన్‌ను ఇందులో అమర్చారు. హోండా SP 125 పవర్‌లో 123.94సీసీ, సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్టెడ్‌ ఇంజన్‌ సౌకర్యాలు ఉన్నాయి. ఈ మోటార్‌ సైకిల్‌ 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. డ్రమ్‌ బ్రేక్‌ కలిగిన బైక్ ధర రూ.85,131, డిస్క్‌ బ్రేక్‌ వాహనం ధర రూ.89,131గా కంపెనీ నిర్ణయించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని