Honda Cars: ‘ఎలివేట్‌’ పేరిట హోండా కొత్త కారు.. వచ్చే నెలలో విడుదల

Honda Cars: ప్రస్తుతం భారత్‌లో సిటీ, అమేజ్ అనే రెండు మోడళ్ల కార్లను విక్రయిస్తున్న హోండా వచ్చే నెలలో ఎలివేట్‌ పేరిట మరో కారును విడుదల చేయనుంది.

Published : 03 May 2023 17:22 IST

దిల్లీ: హోండా కార్స్‌ ఇండియా (Honda Cars India) త్వరలోనే మరో కొత్త కారును తీసుకురాబోతోంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా విక్రయించేలా తీర్చిదిద్దినట్లు వెల్లడించింది. మిడ్‌ సైజ్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ విభాగంలో తీసుకొస్తున్న ఈ కారును ఎలివేట్‌ (Elevate)గా నామకరణం చేసినట్లు బుధవారం ప్రకటించింది.

గ్లోబల్‌ మోడల్‌గా రూపొందించిన ఎలివేట్‌ (Elevate) కారును వచ్చే నెల భారత్‌లో విడుదల చేయనున్నట్లు హోండా కార్స్‌ ఇండియా (Honda Cars India) తెలిపింది. భారత్‌లో ఎస్‌యూవీ (SUV)లకు మంచి గిరాకీ నడుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రయాణికుల వాహనాల్లో ఈ విభాగం వాటానే 47 శాతం. హోండా కార్స్‌ ఇండియా ప్రస్తుతం భారత్‌లో సిటీ (Honda City), అమేజ్ (Honda Amaze) అనే రెండు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని