Honda Price Hike: హోండా కార్ల ధరలు రూ.30,000 వరకు పెంపు
Honda Price Hike: ఇతర కార్ల తయారీ సంస్థల తరహాలోనే హోండా సైతం కార్ల ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది.
దిల్లీ: హోండా ఇండియా (Honda India) తమ కార్ల ధరల్ని జనవరి నుంచి పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. మోడల్‌ను బట్టి పెంపు (Price Hike) రూ.30,000 వరకు ఉంటుందని తెలిపింది. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నామని పేర్కొంది. దీంతో కొత్త ఏడాదిలో ధరలు పెంచనున్న మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్ సరసన హోండా కూడా చేరింది.
ముడి సరకుల ధరలు పెరగడం, కొత్త ఉద్గార ప్రమాణాల అమలు వంటి వాటితో తయారీ వ్యయాలు గణనీయంగా పెరిగినట్లు హోండా కార్స్ (Honda Cars) ఇండియా ఉపాధ్యక్షుడు కునాల్ బెల్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొంత వ్యయభారాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 2023 నుంచి వాహన తయారీ సంస్థలు బీఎస్-6 (BS-IV) రెండో దశ ఉద్గార ప్రమాణాలను అమలు చేయాల్సి ఉంది.
ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు ఉద్గారాల స్థాయిని గుర్తించగలిగే పరికరాలను వాహనాల్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఇవి కీలక భాగాలైన కేటలైటిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్ల ద్వారా ఉద్గారాల స్థాయిని అంచనా వేస్తుంది. అలాగే మండే ఇంధన స్థాయిని సైతం నియంత్రించేలా ప్రత్యేకంగా ప్రోగ్రామ్ చేసిన ఇంజెక్టర్లను అమర్చాల్సి ఉంటుంది. సెమీకండక్టర్లను సైతం మరింత మెరుగుపర్చాల్సి వస్తుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
Sports News
Rishabh Pant: రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం ఇవ్వనున్న దిల్లీ క్యాపిటల్స్!
-
World News
Rishi Sunak: ఇంగ్లాండ్ ఆటగాళ్లతో క్రికెట్ ఆడిన రిషిసునాక్.. వీడియో వైరల్
-
India News
America: అశ్లీల వీడియోలు సరఫరా.. భారతీయుడికి 188 నెలల జైలు..!
-
Sports News
Surya - Samson: సూర్య కుమార్‌ను సంజూ శాంసన్‌తో పోల్చొద్దు... ఎందుకంటే: కపిల్ దేవ్
-
Movies News
Social Look: నెల తర్వాత నివేదా పోస్ట్.. కీర్తి సురేశ్ ‘వెన్నెల’ ఎఫెక్ట్!