Honda EVs:: పెట్రోల్‌ వాహన ధరలకే ఈవీలు.. హోండా ప్రణాళికలు!

Honda EVs: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు కొత్త విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు హోండా ప్రణాళికలు రచిస్తోంది.

Updated : 31 Mar 2023 13:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను విడుదల చేస్తామని ‘హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (HMSI)’ ప్రకటించింది. తొలి వాహనాన్ని మిడ్‌- రేంజ్‌ సెగ్మెంట్‌లో తీసుకొస్తామని తెలిపింది. రెండో మోడల్‌ స్వాపబుల్‌ బ్యాటరీ ఉండేలా రూపొందిస్తామని పేర్కొంది. ఆ తర్వాత మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి కొత్త మోడళ్లను తీసుకొస్తామని తెలిపింది. తొలి వాహనం  2024లో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ ఈవీలు స్యూటర్‌ విభాగంలోనా లేక మోటార్‌ సైకిల్‌ విభాగంలో అని వెల్లడించలేదు.

అలాగే ఏటా పది లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని 2030 నాటికి అందుకుంటామని హెచ్‌ఎంఎస్‌ఐ అధ్యక్షుడు అట్సుషీ ఒగాటా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈవీలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీటిని సొంతంగా ఏర్పాటు చేసుకునే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈవీల తయారీలో బ్యాటరీల ఖర్చే అధికంగా ఉంటుందన్నారు. మొత్తంగా వాహనాల ధర దీనిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రాయితీ లేకుండా తక్కువ ధరలో ఈవీలను అందించడం సవాల్‌తో కూడుకొన్న అంశమని అభిప్రాయపడ్డారు.

తాము తీసుకురాబోయే విద్యుత్‌ ద్విచక్రవాహనాలు డిజైన్‌, టెక్నాలజీ పరంగా ప్రత్యేకంగా ఉంటాయని ఒగాటా తెలిపారు. అలాగే ధర సైతం పెట్రోల్‌తో నడిచే వాహన ధరలకు దగ్గరగా ఉంటుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వాహన ఛార్జింగ్‌ కోసం 6,000 టచ్‌పాయింట్లను సైతం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. అలాగే భారత్‌ నుంచే ఇతర దేశాలకూ విద్యుత్‌ వాహనాలను ఎగుమతి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని