Honda Elevate: భారత్‌లో హోండా ఎలివేట్ ఆవిష్కరణ.. 2030 నాటికి 5 కార్లు
Honda Elevate: భారత్‌లో హోండా ఎలివేట్ ఎస్‌యూవీని కంపెనీ ఆవిష్కరించింది. దీని ఫీచర్లను కంపెనీ ఈరోజు వెల్లడించింది.
దిల్లీ: జపాన్‌కు చెందిన వాహన తయారీ సంస్థ హోండా (Honda India) భారత్‌లో ఐదు కొత్త ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనుంది. 2030 నాటికి వీటిని మార్కెట్‌లోకి తీసుకొస్తామని మంగళవారం ప్రకటించింది. దీంట్లో ఒకటి విద్యుత్ వాహనం కూడా ఉంటుందని తెలిపింది.
మిడ్- సైజ్ ఎస్‌యూవీ విభాగంలో తీసుకొస్తున్న ఎలివేట్ (Honda Elevate)ను మంగళవారం హోండా భారత్‌లో ఆవిష్కరించింది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాతో పోటీ పడనుంది. ఈ కొత్త కారును రాబోయే పండగ సీజన్‌లో మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. దీని పూర్తిస్థాయి విద్యుత్ మోడల్‌ను మూడేళ్లలో తీసుకొస్తామని కంపెనీ తెలిపింది.
భారత్‌లో ప్రస్తుతం సిటీ, అమేజ్ పేరిట రెండు మోడళ్లను మాత్రమే హోండా (Honda India) విక్రయిస్తోంది. ఇవి రెండూ సెడాన్ విభాగంలోకి వస్తాయి. తాజా ఎలివేట్‌తో ప్రయాణికుల వాహన విభాగంలో ఎస్‌యూవీలకు ఉన్న ఆదరణను అందిపుచ్చుకోవాలని హోండా యోచిస్తోంది. ప్రస్తుతం పీవీ విభాగంలో సెడాన్‌ల వాటా 10 శాతం. ఆ 10 శాతంలోనే హోండా మోడళ్లకు మంచి ఆదరణ ఉందని కంపెనీ సీఈఓ టకుయ సుముర తెలిపారు. అదే ఎస్‌యూవీలకు 40 శాతం వాటా ఉందని చెప్పారు. పైగా ఏటా ఇది వృద్ధి చెందుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌యూవీలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకే ఎలివేట్‌ను తీసుకొస్తున్నామని తెలిపారు.
ఎలివేట్ (Honda Elevate)లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) సహా అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఎలివేట్‌ను ప్రపంచవ్యాప్తంగా తొలుత భారత్‌లోనే విడుదల చేస్తోంది. ఒకప్పుడు ప్యాసెంజర్ వెహికల్స్ విభాగంలో మంచి వాటా ఉన్న హోండా.. గత కొన్నేళ్లలో ఆ ప్రభను కోల్పోయింది. మార్కెట్‌లోకి కొత్త కంపెనీలు రావడమే అందుకు కారణం. తిరిగి పూర్వవైభవాన్ని సొంతం చేసుకునేందుకు హోండా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ఎలివేట్ ఫీచర్లు..
- 1.5L i-VTEC DOHC పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు 121 పీఎస్ శక్తిని, 145 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 7 స్పీడ్ సీవీటీ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థను అమర్చారు.
- ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీ బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబీఎస్, హోండా లేన్ వాచ్ కెమెరా, లైట్ క్రాష్ పెర్ఫార్మెన్స్, మల్టీ యాంగిల్ రియర్ కెమెరా, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
- 458 లీటర్ కార్గో స్పేస్ ఉంది.
- 26.03 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ ఉంది. స్మార్ట్‌ఫోన్లను వైర్‌లెస్‌గా దీనికి కనెక్ట్ చేయొచ్చు. యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వెబ్‌లింక్, బ్లూటూత్, యూఎస్‌బీ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా సబ్‌స్క్రీన్ సెక్షన్లు కూడా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: తెలంగాణలో పసుపు బోర్డు: ప్రధాని మోదీ
-
Jaguar Land Rover: 2030 కల్లా 8 విద్యుత్ వాహనాలను తీసుకొస్తాం: జాగ్వార్ ల్యాండ్‌రోవర్
-
PM Modi: మహబూబ్‌నగర్ చేరుకున్న ప్రధాని మోదీ
-
PM Modi: చీపురు పట్టి.. చెత్తను ఎత్తి.. ప్రధాని మోదీ శ్రమదానం!
-
Team India: అప్పుడు యువీ.. మరి ఇప్పుడు
-
Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కర్ణాటకలో భారీ బైక్ ర్యాలీ