Service charge: సర్వీసు ఛార్జీ వసూలు చేయొద్దు.. హోటల్స్‌, రెస్టారెంట్లకు కీలక ఆదేశాలు!

సర్వీసు ఛార్జీ (service charge) విషయమై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (సీసీపీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది.

Updated : 04 Jul 2022 20:19 IST

దిల్లీ: సర్వీసు ఛార్జీ (service charge) విషయమై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (సీసీపీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల నుంచి ఎలాంటి సర్వీసు ఛార్జీలూ వసూలు చేయకూడదని రెస్టారెంట్లు, హోటల్స్‌కు (Hotels, restaurants) సూచించింది. ఎవరైనా ఆదేశాలు ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు తెలిపింది. ఈ మేరకు సీసీపీఏ సోమవారం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. నేషనల్‌ కన్జ్యూమర్‌ హెల్ప్‌లైన్‌కు వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా ఈ మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్లు సీపీపీఏ పేర్కొంది.

  • హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులో ఆటోమేటిక్‌గా లేదా డిఫాల్ట్‌గా సర్వీసు ఛార్జీని వసూలు చేయడానికి వీల్లేదు.
  • ఏ ఇతర పేరుతోనూ సర్వీసు ఛార్జీని వసూలు చేయకూడదు.
  • సర్వీసు ఛార్జీ పేరుతో హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగదారుడుపై ఒత్తిడి తీసుకురాకూడదు.
  • సర్వీసు ఛార్జీ గురించి ముందుగానే వినియోగదారుడికి తెలియజేయాలి. అది వారి ఐచ్ఛికానికే వదిలేయాలి.
  • సర్వీసు ఛార్జీల ఆధారంగా వినియోగదారులకు ప్రవేశం లేదా సేవల్లో పరిమితులు విధించకూడదు.
  • ఎవరైనా వినియోగదారులు హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీసు ఛార్జీ విధిస్తే వెంటనే బిల్లు నుంచి తొలగించాలని కోరవచ్చు.
  • సదరు రెస్టారెంట్స్‌పై నేషనల్‌ కన్జ్యూమర్‌ హెల్ప్‌లైన్‌ (NCH)కు 1915కి ఫోన్‌ చేయడం ద్వారా గానీ, ఎన్‌సీహెచ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా గానీ ఫిర్యాదు చేయొచ్చు.
  • వినియోగదారుల కమిషన్‌, ఈ-దాఖిల్‌ పోర్టల్‌, సీసీపీఏకు ఈ-మెయిల్‌ చేయడం ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు.
  • వినియోగదారుల ఫోరాల్లో సర్వీసు ఛార్జీల విషయంలో వినియోగదారులకు అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయని ఈ సందర్భంగా సీపీపీఏ గుర్తు చేసింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని