ఇళ్ల అమ్మకాల జోరు హైదరాబాద్‌లోనే

కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా, హైదరాబాద్‌లో ఇళ్లు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరిగిందని స్థిరాస్తి బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్‌ వెల్లడించింది. 2020 జనవరి-మార్చిలో 5,554 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయం కాగ........

Published : 09 Apr 2021 14:10 IST

జనవరి-మార్చిలో 38% వృద్ధి
దేశ వ్యాప్తంగా 5 శాతం క్షీణత
ప్రాప్‌టైగర్‌ నివేదిక

దిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా, హైదరాబాద్‌లో ఇళ్లు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరిగిందని స్థిరాస్తి బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్‌ వెల్లడించింది. 2020 జనవరి-మార్చిలో 5,554 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయం కాగా, ఈ ఏడాది ఇదే సమయంలో 38 శాతం పెరిగి 7,721కు చేరాయని తెలిపింది. ఈ కాలంలోనే దేశ వ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు 5 శాతం క్షీణించాయని పేర్కొంది. 8 పెద్ద నగరాల్లో గృహ విక్రయాల తీరుతెన్నులపై ప్రాప్‌టైగర్‌ నివేదిక రూపొందించింది. 2021 జనవరి-మార్చి  లో దేశ వ్యాప్తంగా 66,176 ఇళ్లు/ఫ్లాట్లు విక్రయమయ్యాయి. ఏడాది క్రితం ఈ సంఖ్య 69,555 అని పేర్కొంది. అయితే ఈ 8 నగరాల్లో అమ్మకాలు 29 శాతం పెరిగాయని అనరాక్, 44 శాతం వృద్ధితో సాగాయని పేర్కొంటూ నైట్‌ఫ్రాంక్‌ సంస్థలు ఇటీవల విడుదల చేసిన నివేదికలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని