Air India deal: ఎయిర్ ఇండియా డీల్ అంత పెద్దదా..!
ఎయిర్ ఇండియా ప్రకటించిన విమాన కొనుగోలు డీల్ ప్రపంచ వైమానిక రంగంలో ఓ సంచలనంగా నిలిచింది. ఇది భారత్‌ను వివిధ మార్గాల్లో బలోపేతం చేయనుంది.
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
ఉద్యోగుల జీతాల బకాయిలు, ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాలతో ఏడాది క్రితం వరకు ఎయిర్ ఇండియా వార్తల్లో నిలిచింది.. కానీ, టాటాలు ఆ సంస్థను తిరిగి దక్కించుకోవడంతో దాని దశ మారిపోయింది. ఇటీవలే వైమానిక రంగంలోనే ఓ అతిపెద్ద డీల్‌ను ప్రకటించింది. దాని విలువ సుమారు 70 బిలియన్ డాలర్లు. ఇది కొన్ని దేశాల జీడీపీ కంటే చాలా ఎక్కువ. అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా ఆనందంతో ఉక్కిరిబిక్కిరైందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ డీల్ దేశ పౌరవిమానయాన రంగాన్ని సమూలంగా మార్చడంతో పాటు.. అంతర్జాతీయ వేదికపై భారత్ హోదాను పెంచనుంది.
పెరగనున్న భారత్ పరపతి..
అమెరికా, పశ్చిమ దేశాలు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే అంశం వ్యాపారం. ఈ దేశాలు వ్యాపారం కోసం తీవ్రంగా పోటీపడతాయి. ఆస్ట్రేలియా నుంచి ఫ్రాన్స్‌కు దక్కిన 40 బిలియన్ డాలర్ల విలువైన సబ్‌మెరైన్ల డీల్‌ను అమెరికా, యూకే కలిసి ‘ఆకస్’ ఒప్పందం పేరట తన్నుకుపోయాయి. దీంతో ఫ్రాన్స్ ఆ దేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా దేశాల మధ్య ఏ స్థాయిలో పోటీ ఉంటుందో చెప్పేందుకు ఇదొక ఉదాహరణ. వైమానిక రంగంలో బోయింగ్(అమెరికా), ఎయిర్ బస్(ఫ్రాన్స్) అతిపెద్ద కంపెనీలు. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొవిడ్, ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం దెబ్బకు వైమానిక రంగం కుదేలైపోయింది.
బోయింగ్ ఈ నెల మొదట్లోనే 2,000 మంది హెచ్‌ఆర్, ఫైనాన్స్ ఉద్యోగులను తొలగించింది. గత రెండేళ్లలో ఎయిర్ బస్ కూడా వేల సంఖ్యలో ఉద్యోగులను సాగనంపింది. దీనికి తోడు అతి పెద్దదైన చైనా మార్కెట్ నుంచి ఈ సంస్థలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ సమయంలో భారత్ వాటికి ప్రత్యామ్నాయంగా కనిపించింది. ఒక్క రోజులో ఎయిర్ ఇండియా ఈ రెండు కంపెనీల నుంచి 470 విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. దీంతో బిలియన్ల కొద్దీ డాలర్లు ఈ కంపెనీలకు అందనున్నాయి. 2013లో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ బోయింగ్‌కు ఇచ్చిన 76 బిలియన్ డాలర్ల ఆర్డర్ తర్వాత ఇదే అతిపెద్దది. దాదాపు పదేళ్ల క్రితం అమెరికన్ ఎయిర్‌లైన్స్ కూడా ఇటువంటి భారీ కొనుగోలు చేపట్టింది.
దేశాధినేతలకూ కొంత ఊరట..
వచ్చే సంవత్సరం అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. ఇది బైడెన్ సర్కార్‌కు అగ్ని పరీక్షే. ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రభుత్వం వడ్డీ రేట్లను కూడా పెంచుతూ పోతోంది. దీంతో అక్కడ వ్యాపారాలకు నగదు లభ్యత తగ్గిపోతోంది. ఫలితంగా చాలా సంస్థలు ఖర్చులు తగ్గించుకోవడానికి ఉద్యోగాల తొలగింపును మొదలుపెట్టాయి. బైడెన్ ఆర్థిక విధానాలు కూడా పేలవంగా ఉండటం పరిస్థితిని దిగజార్చింది. వీటిని ప్రత్యర్థులు బైడెనోమిక్స్ అని ఎద్దేవా చేస్తున్నారు. ఇటువంటి సమయంలో ఏకంగా 44 రాష్ట్రాల్లో 10 లక్షల ఉద్యోగాలను సృష్టించే డీల్‌ను భారత్ సంస్థ అందించడం బైడెన్ సర్కారుకు కచ్చితంగా ఊరటనిచ్చే అంశం. మరోవైపు బ్రిటన్ ఆర్థిక పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమీ లేదు. రిషి సునాక్ వచ్చినా ఆ దేశ ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. ఈ సమయంలో భారత్ నుంచి 68 విమాన ఇంజిన్ల కాంట్రాక్టు బ్రిటన్‌కు చెందిన రోల్స్‌రాయిస్‌కు దక్కింది. అన్నింటికి మించి రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ తటస్థంగా ఉంది. దీనిపై పశ్చిమ దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ క్రమంలో రష్యాతో బంధం కొనసాగిస్తూనే.. తాజా డీల్‌తో పశ్చిమదేశాలతో తమ సంబంధాలు పదిలంగానే ఉన్నాయని బలమైన సంకేతాలను పంపినట్లైంది. దీంతో ఒక్క చైనా మినహా.. ఐరాస భద్రతా మండలిలో వీటో హక్కున్న అన్ని దేశాలతో భారత్ మంచి సంబంధాలను నెరుపుతున్నట్లైంది.
ప్రపంచ స్థాయి వైమానిక సేవలు..
ప్రస్తుతం భారత్ రైళ్లలో ప్రతిరోజూ ప్రయాణిస్తున్న 23 మిలియన్ల మందిలో ఒక్కశాతం మంది భవిష్యత్తులో విమానాల వైపు మొగ్గినా.. మార్కెట్ భారీగా పెరగనుంది. ఎయిర్‌బస్ గతేడాది వెలువరించిన అంచనాల ప్రకారం భారత్‌కు వచ్చే 20 ఏళ్లలో 2,210 విమానాలు అవసరం. బోయింగ్ అంచనాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. వీటిల్లో ఐదో వంతుకుపైగా విమానాలను తాజాగా ఎయిర్ ఇండియా ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ ఇండియా యాజమాన్యం టాటాల పరిధిలోకి రాగానే దూకుడు పెరిగింది. ఎమిరేట్స్, కతర్ ఎయిర్‌వేస్ నుంచి ట్రాఫిక్‌ను దక్కించుకోవడానికి ఎయిర్ ఇండియా పోటీపడుతుందని వైమానిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారత్ నుంచి దుబాయ్, దోహాలకు వెళ్లి అక్కడి నుంచి అమెరికా, ఐరోపా దేశాలకు ప్రయాణిస్తుంటారు. తాజా డీల్‌తో ఇంధనాన్ని పొదుపుగా వాడే విమానాలు ఎయిర్ ఇండియా చేతికి అందనున్నాయి. కొత్త విమానాల రాకతో అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు నాన్‌స్టాప్ సర్వీసులను అందించడంపై ఎయిర్ ఇండియా దృష్టిపెట్టనుంది. ఇవి చాలా లాభదాయకమైన వైమానిక మార్గాలు. దేశీయంగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు బలమైన పోటీ ఇవ్వనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: ప్రతి నియోజకవర్గంలో 1000 మంది ప్రముఖులతో.. భాజపా ‘లోక్‌సభ’ ప్లాన్
-
India News
Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసు.. నాలుగో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ
-
Movies News
Randeep Hooda: వీర్ సావర్కర్ పాత్ర కోసం నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గిన హీరో!
-
General News
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం
-
Movies News
ప్రేక్షకులకు గుడ్‌న్యూస్: థియేటర్లో విడుదలైన రోజే కొత్త సినిమా ఇంట్లో చూసేయొచ్చు!
-
Sports News
CSK: పారితోషికం తక్కువ.. పెర్ఫామెన్స్ ఎక్కువ.. ఆ చెన్నై ప్లేయర్స్ ఎవరంటే?