రూ. 1000 ఆదాయం పెరిగితే రూ. 2500 పన్ను మినహాయింపు కోల్పోతారా?

రూ. 2.50 లక్షల నుంచి రూ. 5.00 లక్షల వ‌ర‌కు ఆదాయం ఉన్న వారికి విధించే ప‌న్నురేటును10 నుంచి 5 శాతానికి త‌గ్గించారు. ఎక్కువ ప‌న్ను వ‌సూళ్ళ‌ను సాధించడం, మరి కొంత మందిని ప‌న్ను ప‌రిధిలోనికి ​​​​​​​..

Published : 25 Dec 2020 17:13 IST

రూ. 2.50 లక్షల నుంచి రూ. 5.00 లక్షల వ‌ర‌కు ఆదాయం ఉన్న వారికి విధించే ప‌న్నురేటును10 నుంచి 5 శాతానికి త‌గ్గించారు. ఎక్కువ ప‌న్ను వ‌సూళ్ళ‌ను సాధించడం, మరి కొంత మందిని ప‌న్ను ప‌రిధిలోనికి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప‌న్ను నియ‌మాల‌లో మార్పులు తీసుకువ‌చ్చింది. అంతేకాకుండా ప‌న్ను రిట‌ర్న్‌లు సుల‌భ‌తరం చేసేందుకు బేసిక్‌ ప‌న్ను ప‌రిధి పెంచ‌డం, ఐటీ రిట‌ర్న్‌ల‌ను ఫైల్ చేయ‌డాన్ని ప్రోత్స‌హించేందుకు రిబేట్‌ల‌ను ప్ర‌క‌టించ‌డం వంటి విధానాల‌ను ప్ర‌భుత్వం అనుస‌రిస్తుంది.

​​​​​​​

ఈ నియమాలు కొన్ని విభాగాల‌లోని ప్ర‌జ‌ల‌కు కొన్ని సంవ‌త్స‌రాల పాటు అనుకూలంగానూ, మ‌రికొన్ని విభాగాల‌లోని ప్ర‌జ‌ల‌కు ప్ర‌తికూలంగా ఉంటున్నాయి. ఏదిఏమైనా స్థూల ఆదాయం మొత్తం బేసిక్ ప‌న్ను ప‌రిధి దాటిన వారంద‌రూ ఆదాయ‌పు ప‌న్ను రిటర్న్లు త‌ప్ప‌నిస‌రిగా ఫైల్ చేయాలి. అయితే ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. క్రింది పట్టిక ద్వారా రూ. 1,000 ఆదాయం పెరిగితే రూ. 2,500 పన్ను రిబేట్‌ ప్రయోజనం ఎలా కోల్పోతున్నారో తెలుసుకుందాం.

SENIORS-TAX-EXMPTION.jpg

రూ. 2.50 లక్షల నుంచి రూ. 5.00 లక్షల వ‌ర‌కు ఆదాయం ఉన్న వారికి విధించే ప‌న్నును10 నుంచి 5 శాతానికి త‌గ్గించారు. అదేవిధంగా సెక్ష‌న్ 87 కింద ల‌భించే ప‌న్ను రిబేట్‌ను రూ.5 వేల నుంచి రూ. 2.5 వేల‌కు త‌గ్గించింది. అయితే, ఈ రిబేట్‌ నిక‌ర ఆదాయం రూ.3.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్న‌ వ్య‌క్తుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.

60 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సు వారు

ఉదాహ‌ర‌ణ‌: అరుణ్ అనే వ్య‌క్తి స్థూల ఆదాయం రూ.4.50 ల‌క్ష‌లు. ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80 సీ కింది రూ. 1.50 ల‌క్ష‌ల మిన‌హాయింపు పోనూ మిగిలిన ఆదాయం రూ.3 ల‌క్ష‌ల‌లో బేసిక్‌ మిన‌హాయింపు రూ.2.50 ల‌క్ష‌లు తీసువేస్తే ప‌న్ను ప‌ర‌ధిలోకి వ‌చ్చే ఆదాయం రూ. 50 వేలు. ఈ మొత్తంపై రూ. 2,500(5 శాతం) ప‌న్ను ఉంటుంది. సెక్ష‌న్ 87 కింద రూ. 2,500 రిబేట్ ల‌భిస్తుంది కాబ‌ట్టి, చెల్లించ‌వ‌ల‌సిన ప‌న్ను శూన్యం. ఒక‌వేళ అరుణ్ స్థూల ఆదాయం రూ. 5 ల‌క్ష‌లు అయితే అత‌ను చెల్లించ‌వ‌ల‌సిన ప‌న్ను రూ. 5 వేలు. సెక్ష‌న్ 87 కింద రూ.2500 ప‌న్ను మిన‌హాయింపు తీసివేస్తే అత‌ను చెల్లించ‌వ‌ల‌సిన ప‌న్ను రూ. 2500.

ఒక‌వేళ అత‌ని ఆదాయం రూ.5,01,000 అనుకుంటే, రూ.1000 అధిక ఆదాయంతో అతని నికర ఆదాయం రూ. 3,51,000 లక్షలకు చేరుతుంది. పైన చెప్పిన విధినగా నికర ఆదాయం రూ. 3.50 లక్షలు దాటినందున, సెక్ష‌న్ 87 కింద ల‌భించే ప‌న్ను రిబేట్ ప్ర‌యోజ‌నాన్ని కోల్పోవ‌టం ద్వారా అత‌ను రూ.5,050 ప‌న్ను చెల్లించ‌వ‌ల‌సి వ‌స్తుంది.

సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్స్‌: సూప‌ర్‌ సీనియర్ సిటిజ‌న్‌ల‌కు బేసిక్ మిన‌హాయింపు ప‌ర‌ధి రూ.5 ల‌క్ష‌లు. అందువ‌ల్ల‌, వారికి సెక్ష‌న్ 87 వ‌ర్తించ‌దు.

ముగింపు: వ్య‌క్తుల నిక‌ర ప‌న్ను ఆదాయం రూ.3.50 ల‌క్ష‌ల‌కు మించ‌ని వారు, రూ. 2500 ప‌న్ను ప్ర‌యోజ‌నాన్ని కోల్పోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఇందుకోసం అద‌న‌పు ప‌న్ను ఆదా చేసే సాద‌నాల‌ను ఉపయోగించవచ్చు. వారు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌డం ఎలా అనే విషయం పై ఆలోచించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని