బ్యాంకులు మీ పాన్ వివ‌రాల‌ను ఏవిధంగా వెరిఫై చేస్తాయో తెలుసా?

ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఎన్‌ఎస్‌డీఎల్ లేదా యుటీఐ ద్వారా భౌతికంగా, ఎలక్ట్రానిక్ రూపాల‌లో 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ నెంబ‌రుతో కూడిన కార్డును జారీ చేస్తుంది

Updated : 02 Jan 2021 14:55 IST

సాధార‌ణంగా కొత్త‌గా బ్యాంకు ఖాతా, డీమ్యాట్ ఖాతాల‌ను తెరిచేట‌ప్పుడు, మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను కొనుగోలు చేసేప్పుడు లేదా కొత్త‌గా ఉద్యోగంలో చేరేప‌పుడు మీ పాన్‌(శాశ్వ‌త ఖాతా సంఖ్య‌) కార్డును అడుగుతారు. కొన్ని సంద‌ర్భాల‌లో కేవ‌లం పాన్ నెంబ‌రు చెప్తే స‌రిపోతుంది. మ‌రికొన్ని సంస్థ‌ల‌కు పాన్ జిరాక్స్ కాపీ లేదా సాఫ్ట్ కాపీని ఇవ్వాల్సి వ‌స్తుంది.

ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఎన్‌ఎస్‌డీఎల్ లేదా యుటీఐ ద్వారా భౌతికంగా, ఎలక్ట్రానిక్ రూపాల‌లో 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ నెంబ‌రుతో కూడిన కార్డును జారీ చేస్తుంది. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు(ఐటీఆర్‌) దాఖ‌లు చేసేందుకు పాన్ కార్డు త‌ప్ప‌నిస‌రి. అందువ‌ల్ల ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఒక్కక్క‌రికి ఒక ప్ర‌త్యేక‌మైన పాన్ నెంబ‌రును కేటాయిస్తుంది. అంతేకాకుండా అనేక లావాదేవీల‌లో ఇది గుర్తింపు కార్డుగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ప‌న్ను చెల్లింపుదారుల‌తో పాటు పాన్ కార్డు హోల్డ‌ర్ల పూర్తి డేటాబేస్ ఆదాయ‌పు ప‌న్ను శాఖ వ‌ద్ద ఉంటుంది. పాన్ వివ‌రాలు స‌రైన‌వా…కావా… అనే స‌మాచారాన్ని తెలుసుకునేందుకు వ్య‌క్తులను గానీ, కంపెనీలు, ఏజెంట్లు, బ్యాంకులను గానీ ఆదాయ‌పు ప‌న్ను శాఖ అనుమ‌తిస్తుంది. పాన్ కార్డ్ నకిలీదా… కాదా… అని తెలుసుకోవడానికి ఇది అందరికీ సహాయపడుతుంది.

పాన్ కార్డు ప్రామాణిక‌త‌ను ఆదాయ‌పు ప‌న్ను వెబ్‌సైట్ ద్వారా ధృవీక‌రించ‌వ‌చ్చు. ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌కి వెళ్ళి కుడివైపున ఉన్న‌ "వెరిఫై యువ‌ర్ పాన్ డీటైల్స్‌"పై క్లిక్ చేయాలి. ఇందులో పాన్ కార్డు నెంబ‌రు, పాన్ కార్డు హోల్డ‌ర్ పేరు, అతను లేదా ఆమె పుట్టిన తేదీ, స్థితి వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు పోర్ట‌ల్‌లో మీరు చెప్పిన వివ‌రాలు, పాన్ కార్డు నెంబ‌రుతో స‌రిపోతుంద‌ని… లేద‌ని … వెబ్‌సైట్‌లో వ‌స్తుంది.

ఎక్కువ సంఖ్య‌లో పాన్ కార్డులను ధృవీకరించాల్సిన బ్యాంకులు, కార్యాలయాలు లేదా ప్రభుత్వ సంస్థలు వంటివి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో తమను బల్క్ పాన్ వెరిఫికేషన్ ఏజెన్సీగా నమోదు చేసుకుంటాయి. త‌రువాత పాన్ క్వ‌యిరీపై క్లిక్ చేసి నిర్థిష్ట ఫార్మెట్‌లో అప్‌లోడ్‌చేసి స‌బ్మిట్ చేసి తెలుసుకుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని